సాధరణంగా మనం ఏదైనా శుభకార్యాన్ని కానీ మంచి పనిని కానీ ప్రారంభించే ముందు ఒక పండితుడి చేతుల మీదగా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టడం ఆనవాయితీగా మన సంస్కృతీ లో భాగంగా వస్తుంది.
అయితే పలానా పండితుడు చేతుల మీదగా ఏ కార్యం మొదలు పెట్టినా అది దిగ్విజయమే అవుతుంది అంటూ కొన్ని గట్టి నమ్మకాలు కూడా సమాజంలో బలంగా నాటుకుపోయాయి.
అలాగే ఎక్కువగా ఆ నమ్మకాలు వైద్యుల దగ్గర కనిపిస్తాయి. ఆ డాక్టర్ చేయి పడితే చాలు నాకు సగం రోగం నయమవుతుంది. ఆ డాక్టర్ దగ్గరకు వెళితేనే సమస్య పరిష్కారం అవుతుంది ఇలా నిత్యం ఎదో ఒక సందర్భంలో ఇటువంటి వార్తలు వింటూనే ఉంటాము.
అయితే ఇదంతా ‘హస్తవాసి’ మహిమ అంటారు పెద్దలు. కొంతమంది చేతుల మీదుగా ఏదైనా కార్యాన్ని మొదలు పెడితే దానికి తిరుగుండదు, దాని అభివృద్ధికి కొదవుండవు అనే దానికి ప్రతిగా ఈ హస్తవాసి అనే మాటను ప్రయోగిస్తారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మొదలైన CRDA కార్యాలయం వేడుకలను చూస్తుంటే బాబు హస్తవాసి మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది.
గతంలో బాబు చేతుల మీదగా మొదలైన హైద్రాబాద్ అభివృద్ధి పనులు అంచెలంచెలుగా ఎలా అయితే ఆకాశాన్ని తాకాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సైతం ఐదేళ్ల వైసీపీ గ్రహాన్ని వదిలించుకుని తిరిగి అభివృద్ధి వైపు పరుగులు పెట్టేందుకు సిద్డమయ్యింది.
నాడు కొండలు గుట్టలుగా ఉన్న హైద్రాబాద్ నగరంలో బాబు ఒక హైటేక్ సిటీని చూసారు. అలాగే తన విజనరీని ఆవిష్కరిస్తూ సైబరాబాద్ అనే ఒక మహా నగరాన్ని నిర్మించారు. ఆయన చేతుల మీదగా ప్రారంభమైన హైద్రాబాద్ అభివృద్ధి ఒక్కో నాయకుడి చేతుల మీదగా ఎదుగుతూ చివరికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కారణంగా నిలిచింది.
ఈ అభివృద్ధి చివరికి ఏ స్థాయికి చేరింది అంటే నాడు హైద్రాబాద్ లో ఉండే భూముల ధరలు వేలల్లో ఉంటే నేడు అదే ప్రాంతంలో ఎకరం భూమి ధర వందల కోట్లు పలుకుతుంది. ఇక ఇప్పుడు అమరావతి విషయానికొస్తే 2014 లో ముఖ్యమంత్రిగా బాబు చేత ప్రకటించబడ్ద, బాబు చేత అంకురార్పణ చేయబడ్డ అమరావతి బాబు విజనరీకి మరో సవాల్ గా మారింది.
అయితే 2019 లో ప్రభుత్వాలు మారడంతో రాజధాని అమరావతి పై వైసీపీ కుల నిందలు మోపి, వరద ప్రాంతమంటు బురద రాజకీయం చేసింది. అలాగే అమరావతిని స్మశానం అంటూ శంకించారు. ఇక ప్రజా వేదిక కూల్చివేతతో మొదలు పెట్టిన వైసీపీ అమరావతిని బతకనిస్తుందా.? అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఏపీ ప్రజల అనుమానాలకు తగ్గట్టే వైసీపీ అమరావతి భవిష్యత్ తో మూడుముక్కలాట ఆడింది. దీనితో గత ఐదేళ్ళ వైసీపీ పాలనలో సమాధిగా మారిన అమరావతి ఇక తిరిగి ప్రాణం పోసుకుంటుందా.? అమరావతి అభివృద్ధికి నోచుకుంటుందా.?
నిర్మాణాలను పూర్తి చేసుకుంటుందా.? కొత్త నిర్మాణాలను మొదలు పెడుతుందా.? రాజధాని రైతుల త్యాగానికి విలువ ఉంటుందా.? అంటూ ఇలా చిక్కువిప్పలేని ప్రశ్నలెన్నో అమరావతిని చుట్టూ ముట్టేశాయి. అయితే అన్ని అవమానాలను, అవహేళనలను మోసిన అమరావతి వైసీపీ అరాచకాలను తట్టుకుని నిలబడి తిరిగి ఆంధ్రప్రదేశ్ ను నిలబెట్టెందుకు సిద్దమయ్యింది.
ఈ తరుణంలోనే బాబు నిర్మాణ సంకల్పం ఎంత బలమైనది, ఆయన హస్తవాసి ఎంత బలీయమైనది అనేది తెలిసొచ్చింది. ఐదేళ్ల అరణ్య రోదనను దాటుకుని, ఐదేళ్ల అజ్ఞాతవాసాన్ని ముగించుకుని తిరిగి జీవం పోసుకుంది, నిర్మాణాల ప్రారంభ వేడుకలతో కళకళలాడుతుంది.




