కేసీఆర్‌ పదేళ్ళలో సాధించలేనిది చంద్రబాబు ఆర్నెలలోనే..

Chandrababu Naidu Meet Opposition Leaders in New Delhi

ఓ రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవిదంగా వ్యవహరించాలో చంద్రబాబు నాయుడు ఆచరణలో చేసి చూపుతూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి తన పరిమితులు, బలాలు, బలహీనతలు బాగా తెలుసు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలుసు.

ఎన్నికలకు ముందు పొత్తుల కోసం బీజేపి పెద్దలతో రాజీపడి చాలా త్యాగాలకు సిద్దపడ్డారు. అప్పుడు సొంత పార్టీ నేతలు, రాజకీయ విశ్లేషకులు సైతం ఆయన నిర్ణయాన్ని తప్పు పట్టారు. కానీ జగన్‌ ఒక్కరే ముందుగా ప్రమాదం పసిగట్టి గగ్గోలు పెట్టారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అందరూ చంద్రబాబు నాయుడు రాజకీయ చతురతని మెచ్చుకున్నారు.

ADVERTISEMENT

రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకునే విషయంలో చంద్రబాబు నాయుడు తన శక్తియుక్తులు, కేంద్రంలో పలుకుబడి, పరిచయాలు అన్నిటినీ వినియోగించుకుంటారు. అందుకే బీజేపి రాష్ట్రాలైన గుజరాత్, యూపీ రాష్ట్రాలకు దక్కాల్సిన నవరత్న బీపీసీఎల్‌ కంపెనీని ఏపీకి సాధించుకున్నారని జాతీయ మీడియా అభివర్ణించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, రామాయపట్నంలో రూ.95,000 కోట్లు పెట్టుబడితో బీపీసీఎల్‌ కంపెనీ ఏర్పాటు కాబోతోంది.

తాజా సమాచారం ప్రకారం జనవరి 8న ప్రధాని మోడీ ఆంధ్రాలో పర్యటించనున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకి భూమిపూజ, అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద ఎన్టీపీసీ-ఏపీ జెన్కో కలిసి లక్ష కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్న గ్రీన్ హైడ్రోజన్ హబ్, అనకాపల్లి జిల్లాలోనే నక్కపల్లి వద్ద రూ.70,000 కోట్ల పెట్టుబడితో ఆర్సలర్-మిట్టల్ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్న స్టీల్ ప్లాంట్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేసేందుకు ప్రధాని మోడీ వస్తున్నారు.

తెలంగాణకు సుమారు లక్ష కోట్ల పెట్టుబడులు సాధించేందుకు కేటీఆర్‌కి పదేళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలలోనే ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రానికి సుమారు ఇన్ని కోట్ల పెట్టుబడులు సాధించి ఎవరూ తనతో పోటీ పడలేరని నిరూపించి చూపారు.

చంద్రబాబు నాయుడు ఏనాడూ జాతీయ రాజకీయాలలోకి వెళ్తానని కేసీఆర్‌లాగ హడావుడి చేయలేదు. ఢిల్లీలో చక్రం తిప్పుతనని గొప్పలు చెప్పుకోలేదు. కానీ నేడు కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్డీయే మిత్రపక్షాలలో కూడా కీలకంగా ఉన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ఏపీకి రావలసినవన్నీ పట్టుబట్టి సాధించుకుంటున్నారు.

తన అంత మహామేధావి లేడని విర్రవీగిన కేసీఆర్‌, తన అంత పోటుగాడు లేడని విర్రవీగిన జగన్‌ పరిస్థితి ఇప్పుడు ఏవిదంగా ఉందో అందరూ చూస్తూనే ఉన్నారు. నిజానికి వారిరువురూ చంద్రబాబు నాయుడుని చూసి చాలా నేర్చుకోవచ్చు. కానీ ఇద్దరికీ అహం అడ్డొస్తుండటంతో నేర్చుకోవడానికి ఇష్టపడటం లేదు. అదే వారి పార్టీల పాలిట శాపంగా మారుతోంది.

ADVERTISEMENT
Latest Stories