రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ని కలవడానికి ఆయన కుటుంబసభ్యులకు వారానికి రెండు సార్లు,ఆయన తరుపు న్యాయవాదులు రోజుకు రెండు సార్లు బాబుతో ములాఖత్ అవడానికి అవకాశం ఉండేది. అయితే బాబు అనారోగ్యం బారినపడడంతో ఈ సంఖ్యను మరింత పెంచాలంటూ టీడీపీ నాయకులు జైలు అధికారులను, ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
ములాఖత్ సంఖ్యను పెంచాలి అని కోరిన టీడీపీ వర్గాలకు జైలు అధికారులు షాక్ ఇచ్చారనే చెప్పాలి. రోజుకు రెండు సార్లు కలవడానికి అనుమతినిచ్చే బాబు న్యాయవాదులకు ఇకనుండి రోజుకు ఒక్కసారి కలిసే అవకాశం మాత్రమే ఉంటుందని జైలు అధికారులు సమాచారం ఇచ్చారు. బాబు ములాఖత్ల వలన ఇతర ఖైదీలకు ఇబ్బంది కలుగుతుంది అంటూ ఒక విచిత్రమైన సాకుతో ములాఖత్ లలో కోత విధించారు.
రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాకు మొత్తం చంద్రబాబుకే కేటాయించాము అంటూ చెప్పుకొచ్చిన జైలు అధికారులు ఇప్పుడు ఆ బ్లాకుకు ఇతర ఖైదీలకు సంబంధం ఎలా ఉంటుందో కూడా చెపితే బాగుండేది. బాబుకి జైల్లో రక్షణ లేదు అంటూ టీడీపీ నేతలు ఆరోపించినప్పుడు ఇదే జైలు అధికారులు బాబు అనుమతి లేకుండా ఆయన బ్లాకు లోకి ఎవరిని అనుమతించడం లేదు. ఆయన భద్రతపై ఎలాంటి అనుమానం అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చారు.
ఆయన దగ్గరకు ఏ ఇతర ఖైదీలు చేరుకునే అవకాశమే లేదు. ఆయన భద్రతపై ఎలాంటి అనుమానం అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చిన అధికారులు ఇప్పుడు మాత్రం ఆయన బ్లాకులోకి వెళ్తే ఇతర ఖైదీలకు ఇబ్బంది కలుగుతుంది అంటూ మాటమార్చడం వెనుక ఉన్న ఆ అతీత శక్తులు ఎవరో బయటపెట్టాలంటూ టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలలో కోతలు విధిస్తున్న ముఖ్యమంత్రి ఇక ములాఖత్ సంఖ్యలో కూడా కోతలు విధించమని జైలు అధికారులకు ఆదేశాలిచ్చారో ఏమో కానీ అధికారులు ఆచరణకు సిద్ధమయ్యారు.




