chandrababu-naidu-ys-jagan-2024

గడిచిన 24 గంటలుగా ప్రధాన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో మరియు సోషల్ మీడియాలలో జగన్ రుషికొండ ప్యాలెస్ గురించి హోరెత్తుతోన్న విషయం తెలిసిందే. మరొక రోజు ముందుకెళితే ‘ఫర్నిచర్ దొంగ జగన్’ అంటూ మరొక ప్రధాన శీర్షిక వెలువడింది.

నిజమే… ఇవన్నీ కూడా వాస్తవాలే. ప్రజలు కూడా ఇవన్నీ గమనించారు కాబట్టే 164 సీట్లతో కూటమిని ఆశీర్వదించారు. 11 సీట్లతో జగన్ ను ఓ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి వెలివేశారు.

Also Read – కొడాలి వీడియోని ‘టచ్’ చేసిన సోషల్ మీడియా…!

అందుకనే విశాఖే రాజధాని, విశాఖలోనే ప్రమాణ స్వీకారం అని ఒకటికి వంద సార్లు జగన్ చెప్పినా కూడా, ఒక్కటంటే ఒక్క సీటు కూడా విశాఖలో వైసీపీకి దక్కనివ్వలేదు. ‘మా ప్రాంతం పరిసరాల్లోకి కూడా అడుగుపెట్టొద్దు మహాప్రభో’ అంటూ నినదించారు.

కట్ చేస్తే… కూటమి ప్రభుత్వం ఈ ‘ఫర్నిచర్ దొంగ’ని, ‘పెత్తందారుడి పేద ప్యాలెస్’ గురించి ప్రజలకు తెలిసేలా నిస్పక్షపాతంగా మీడియా సమక్షంలోనే వెలుగులోకి తీసుకువచ్చింది. అభినందించదగ్గ విషయమే!

Also Read – జగన్ ‘పరామర్శ’ యాత్ర…!

అయితే కూటమి ప్రభుత్వం ఇక్కడే ఆగిపోతుందా? లేక అక్రమాలు చేసి ఐదేళ్లు పాలన చేసిన జగన్ పై చర్యలకు దిగుతుందా? లేదా? అని కూటమి మద్దతుదారులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎంతో ఉత్సుకతతో వేచిచూస్తున్నారు.

ఎందుకంటే… 2014లో విభజన తర్వాత అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జగన్ నేతృత్వంలోనే తుని రైలు మంటలు, రాజధానిలో పొలాలు అగ్నికి ఆహుతి కావడం వంటి సంఘటనలు జరిగినా అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేసింది. దాని తాలూకా పర్యవసానాలను కూడా గడిచిన ఐదేళ్లు టీడీపీ అనుభవించాల్సి వచ్చింది.

Also Read – అమరావతిలో బసవతారకం….

అదీగాక పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా తిరగడానికి జగన్ కు అనుమతులతో పాటు భద్రతను కల్పించింది టీడీపీ ప్రభుత్వం. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అధికారానికి దూరమయ్యే చివరి క్షణం వరకు టీడీపీ మద్దతుదారులతో పాటు ఆ పార్టీ అధినేత బాబు వరకు ఎవ్వరిని ఉపేక్షించకుండా దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెట్టుకుంటూ అరెస్టులు చేసి జైలుకు పంపించారు.

నేటి పరిస్థితులు కూడా అందుకు భిన్నంగా ఏమి లేదు. గడిచిన అయిదేళ్ల జగన్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి అయితే తీసుకువస్తున్నారు గానీ, దానికి చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటారా? అంటే కాలమే సమాధానం చెప్పాలి. అయితే జగన్ మాదిరి కక్ష్య సాధింపు చర్యలు కాకుండా చట్టపరంగా శిక్షిస్తాం అంటూ చెపుతుంది కూటమి ప్రభుత్వం.

ఐదేళ్ల అణివేతను, అవమానాలను పంటిబిగువున దాచుకున్న కూటమి మద్దతుదారులు మాత్రం ఆ సమయం ఎప్పుడు వస్తుందా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. గతంలో మాదిరి బాబు ఇటువంటి సంఘటనలు మీద ద్రుష్టి పెట్టక పాలన మీదే ఫోకస్ చేస్తే వైసీపీ కి ఇదే అలవాటుగా మారిపోతుంది.




అధికారం ఉందనే వైసీపీ నేతల అహంకార ధోరణికి కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ఐదేళ్ల సామాన్యుడి నిస్సహాయతకు న్యాయం చేయాలంటూ కోరుకుంటున్నారు. మంచితనం చేతకాని తనం కాకూడదు. అధికారానికి దూరమై కనీసం ప్రతిపక్ష నేత గా కూడా అర్హత సాధించలేని జగన్ ఇప్పటికి అదే రెచ్చకొట్టే ధోరణిలో ముందుకెళ్తున్నారు. ఇటువంటి సమయంలో బాబు ఉపేక్షిస్తే అది కూటమి ప్రభుత్వ నిస్సహాయతే అవుతుంది.