నెలరోజుల టీడీపీ నేతల ఎదురుచూపులు ఎట్టకేలకు తెరపడింది. జైలు నుండి బయటకు వచ్చిన బాబుని చూసేందుకు, తమ సంఘీభావం తెలిపేందుకు పెద్ద ఎత్తున చంద్రబాబు అభిమానులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు చేరుకున్నారు.
జై బాబు అంటూ నినాదాలతో రాజమండ్రి వద్దకు చేరుకున్న తన అభిమానులను, తెలుగు ప్రజలను ఉద్దేశించి బాబు తనసందేశాన్ని ఇచ్చారు. కష్ట సమయంలో తనకు,తన కుటుంబానికి, పార్టీకి అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచేసారు. అలాగే తన అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపిన తెలుగు ప్రజలందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.
అలాగే తానూ ఆపదలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మద్దతు మరువలేనిదని, ప్రత్యేకించి పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. తనకు మద్దతు పలికిన రాజకీయ పార్టీలకు ఆయా నేతలకు కృతజ్ఞతలు తెలియచేసారు. తన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పు చేయలేదని, చేయనివ్వనని తెలియచేసారు.
కాసేపు మీడియాతో మాట్లాడిన చంద్రబాబు తిరిగి విజయవాడ బయలుదేరారు. అయితే బాబు ను చూసేందుకు వచ్చిన టీడీపీ అభిమానులతో రాజమండ్రి పరిసరప్రాంతాలు జనంతో కిక్కిరిసి పోయాయి. బాబు కాన్వాయి కదలడానికి చాల సమయం పట్టడంతో టీడీపీ నేత అచ్చం నాయుడు కార్యకర్తలకు సంయమనం పాటించాలి అంటూ విజ్ఞప్తులు చేసే పరిస్థితి వచ్చింది. అభిమానానికి కృతజ్ఞతలు! స్పందనకు ధన్యవాదాలు! అంటూ బాబు ముందుకెళ్తున్నారు.




