మహారాష్ట్ర కోర్టు చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసిన నేపద్యంలో బీజేపీ ఇరుకున పడింది. ఉద్దేశపూర్వకంగానే బీజేపీ తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని చంద్రబాబు చేసిన ఆరోపణ ప్రజలలోకి బాగా వెళ్ళింది. అయినా సరే బీజేపీ నేతలకు జ్ఞానోదయం కలిగినట్టుగా లేదు.
[m9ad]
తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు, నిరసనల ఆదారంగా కోర్టు ధిక్కార పిటిషన్ వేయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. బాబ్లీ వ్యవహారంలో న్యాయవ్యవస్థను కించపరిచేలా సీఎం వ్యాఖ్యానించారని,ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లి దిక్కార పిటిషన్ వేయనున్నామని జివిఎల్ నరసింహారావు చెప్పారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఈ పిటిషన్ సిద్ధమవుతోందని చెప్పారు. ముంబై హైకోర్టులో సీఎం చంద్రబాబుపై పిల్ వేయబోతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదే జరిగితే తెలుగు దేశం పార్టీకి మరింత మైలేజి రావడం ఖాయం. ఇది కచ్చితంగా సెల్ఫ్ గోల్ అనే అనుకోవాలి.



