బాబు లేఖ: ప్రమాదపు అంచులలో నేను, నా కుటుంబం!

Chandrababu-Naidu-Political-Sketch

స్కిల్ కేసులో అరెస్టయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిచిన కొద్దీ రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబు ఇప్పుడు తాజాగా తన భద్రత పై కూడా పలు అనుమానాలను వ్యక్త పరుస్తూ ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తికి లేఖ రాసారు.ఈ లేఖలో బాబు ప్రస్తావించిన పలు అంశాలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి.

రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారుల ద్వారా ఈ లేఖను న్యాయమూర్తికి పంపించారు చంద్రబాబు. జైలు పై అనధికారికంగా డ్రోన్లు ఎగరేస్తున్నారని, తన కుటుంబసభ్యులు ములాఖత్ కు వచ్చిన సమయంలో కూడా ఈ డ్రోన్ల కలకలం ఉంటుందని, ఎప్పటికప్పుడు తన కదలికలను డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.

ADVERTISEMENT

ఎస్ కోటకు చెందిన ఓ ముద్దాయి పెన్ కెమెరాలతో ఇక్కడి విజువల్ చిత్రీకరిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందంటూ, తనను అంతమొందించడానికి వామపక్ష తీవ్రవాదులు కుట్ర చేస్తున్నారని, అందుకు సంబందించిన లేఖ పై జైలు అధికారులు ఎటువంటి విచారణ చేపట్టలేదని, తనకే కాదు తన కుటుంబానికి కూడా ప్రమాదం పొంచి ఉందని చంద్రబాబు మూడు పేజీలతో కూడిన లేఖను ఏసీబీ న్యాయమూర్తికి రాశారు.

జైలు ఆవరణలోకి గంజాయి ప్యాకెట్లను ఎవరో విసిరేస్తున్నారు అన్నారు. తానూ జైల్లోకి వచ్చిన సమయంలో కూడా తన విజువల్స్ తీసి బయటకు వదిలారని అది తన గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లేలా చేస్తాయంటూ తన ఆవేదనను వెల్లడించారు. తనను అంతమొందించడానికి పెద్దమొత్తంలో సుపారీ చేతులు మారిందని తనకు,తన కుటుంబసభ్యులకు రక్షణ కలించాలంటూ ఆ లేఖలో తన ఆందోళనను న్యామూర్తికి వివరించారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, మరో 14 ఏళ్ళు ప్రతిపక్షనేతగా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు సేవ చేసిన ఒక విజనరీ నాయకుడు తన రాష్ట్రంలోనే తనకు భద్రత లేదు అంటూ న్యాయమూర్తికి లేఖ రాయవలసిన పరిస్థితి వచ్చిందంటేనే అర్ధమవుతుంది జైలు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆయన భద్రత పై ఏమాత్రం శ్రద్ద చుపిస్తున్నారో అనేది.

ఇప్పటికే ఇన్ఫెక్షన్ చేరి చర్మ, కంటి సమస్యలతో బాధపడుతున్న బాబు ఇప్పుడు తన ప్రాణానికే ముప్పు వాటిల్లబోతుంది అంటూ లేఖ రాయడంతో అటు బాబు కుటుంబ సభ్యులతో పాటు ఇటు టీడీపీ క్యాడర్లో కూడా బాబు ప్రాణాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదీకాక వైసీపీ నేతలు పదేపదే చంద్రబాబు చావు ప్రస్తావన తేవడం కూడా ఈ ప్రభుత్వం పై టీడీపీ శ్రేణులు అనుమానాలకు బలం చేకూస్తున్నాయి.

బాబు ఆరోగ్య సమస్యల పై, బాబుని అంతమొందిస్తాం అంటూ రాస్తున్న బెదిరింపులేఖల పై గోప్యత పాటించడం ఆయా అధికారులపై కూడా నమ్మకాన్ని నీరుకారుస్తున్నాయి. కోర్టులు, కేసులు అంటేనే సంబంధం లేని కుంటి సాకులు చెప్పి న్యాయస్థానాల విలువైన సమయాన్ని కాలయాపనతో వృధా చేసే వైసీపీ నేతలకు మాత్రం బాబుని విమర్శించే హక్కు లేదనే చెప్పాలి, అంతేకాదు ఈ ఒక్క విషయంలో మాత్రం చంద్రబాబుని అభినందించక తప్పదు.

తన చుట్టూ ఉన్న పరిస్థితులు తనను ఎంత కుంగతీస్తున్న తానూ తప్పు చేయలేదు అని తన పై తనకున్న నమ్మకాన్ని వదులుకోకుండా, న్యాయస్థానాలకు నాకు గుండె నొప్పి, నా భార్యకు కాలు నొప్పి అంటూ కుంటి సాకులు చెప్పకుండా న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులను గౌరవిస్తూ తన ప్రయాణాన్ని అంతే పట్టుదలతో కొనసాగించడం అది ఏడూ పదుల వయస్సులో ప్రశంసించదగ్గ విషయం.

తన ప్రాణానికి, తన కుటుంబసభ్యుల ప్రాణాలకు ముప్పు ఉంది భద్రత పెంచాలి అంటున్నారే కానీ తనను జైలు నుండి బయటకు పంపండి, నాకు ఇక్కడి ప్రభుత్వం పై, ప్రభుత్వ అధికారుల పై కానీ ప్రభుత్వ వైద్యుల పై కానీ నమ్మకం లేదని కానీ పక్క రాష్టానికి తరలించాలని కానీ కోరడం లేదు. ఇలా చెప్పింది ఎవరో, అలా చెప్పి పక్క రాష్ట్రాలకు వెళ్ళింది ఎవరో అందరికి తెలిసిన విషయమే అనుకోండి.

ADVERTISEMENT
Latest Stories