అమరావతి పరుగు వైసీపీ పతనమే…

Chandrababu Pushes Amaravati Capital Plans with Delhi Talks

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజించబడి ఇప్పటికి దశాబ్దం దాటినా, రెండు ప్రభుత్వాలు తమ పదవి కాలం పూర్తి చేసుకుని మూడో ప్రభుత్వం కొలువుతీరినా ఏపీ రాజధాని అమరావతికి ఇంకా ఒక రూపం రాలేకపోయింది.

దీని వెనుక అనేక రాజకీయ కారణాలు, వైసీపీ రాజకీయ ద్వేషాలు ఉన్నప్పటికీ తిరిగి కూటమి రాకతో వచ్చే రెండు మూడేళ్ళలో అమరావతికి రాజధానిగా ఒక నిర్దిష్టమైన రూపాన్ని తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తున్నారు.

ADVERTISEMENT

ఇందుకుగాను అటు కేంద్రంతో సంప్రదింపులు, నిధుల కోసం చర్చలు, సమావేశాలు జరుపుతూనే మరోపక్క రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకపక్క భారీ వర్షాలతో వాతావరణం సహకరించకపోయినా,

మరోపక్క వైసీపీ విష ప్రచారాలతో అడ్డుకట్టలు వేయడానికి ప్రయత్నిస్తున్నా బాబు మాత్రం పట్టువదలని విక్రమార్కుడి మాదిరి కూటమి హయాంలోనే అమరావతికి రాజధాని ఆకారాన్ని తీసుకురావాలని గట్టి పట్టుదలగా పనిచేస్తున్నారు.

ఇందులో భాగంగానే నేడు ఢిల్లీకి వెళ్లిన బాబు కేంద్ర మంత్రులతో సమావేమవుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తో భేటీ అయిన బాబు రాష్ట్రానికి పూర్వోదయ పథకం కింద నిధులు మంజూరు చెయ్యాలంటూ కోరారు.

పూర్వోదయ కింద ఇప్పటికే బీహార్, జార్ఖండ్, బెంగాల్, ఒడిశా లకు నిధులు కేటాయించిన కేంద్రం తాజాగా ఈ జాబితాలో ఏపీని కూడా చేర్చింది. దీనితో బాబు సీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ, కొబ్బరి తోటలు, కోస్తాలో ఆక్వా కల్చర్ ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించి ఆ ప్రణాళికలను నిర్మలాకు అందించారు.

అలాగే అమరావతి మొదటి పేజ్ 2029 కి పూర్తయ్యేలా పనుల వేగం పెంచింది కూటమి ప్రభుత్వం. ఇందు కోసం 32,316 కోట్లకు పైగా అవసరమని అంచనాకొచ్చిన ప్రభుత్వం గవర్నమెంట్ కాంప్లెక్స్ కు 101,71 కోట్లు, ప్రాథమిక వసతులకు 8845 కోట్లు, శాశ్వత మౌలిక సదుపాయాల ఏర్పాటుకు 109,49 కోట్లు అంచనా వ్యయానికొచ్చింది.

అయితే ఇందులో కొంత కేంద్రప్రభుత్వం రుణంగా ఇవ్వగా మిగిలినది ఇతర ఆర్థిక సంస్థల నుంచి నిధులు సేకరించాలని ఏపీ CRDA నిర్ణయించింది. అయితే కూటమి ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్టుగా ఇంప్లిమెంటేషన్ చేయగలిగి అమరావతి పనులను పరుగులు పెట్టించినట్లైయితే ఇక వైసీపీ పతనం దిశగా పయనించక తప్పదు.

ఇప్పటికే వైసీపీ అమరావతి పై తన విధానాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రుచి చూపించింది. కాబట్టి రాజధాని నిర్ణయం పై వైసీపీ అభిప్రాయాన్ని ఇక్కడ ఎవ్వరు విశ్వసించే సాహసం చేయజాలరు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న వైసీపీ రాజధానితో ఆడిన మూడు ముక్కలాట ఇప్పటికి ఏపీ ప్రజల ముందు కదలాడుతూనే ఉంది.

సమాధి నుంచి స్మశానం దాకా, వరద నుంచి బురద దాక అమరావతి పై వైసీపీ చేయని విష ప్రచారం లేదు. నాటి ఐదేళ్లు రాజధాని నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చలేని వైసీపీ ప్రజావేదికతో కూల్చివేతలు ప్రారంభించింది. నాటి వైసీపీ కూల్చివేతల చేదు జ్ఞాపకాలు ఇప్పటికి ఏపీని వెంటాడుతూనే ఉన్నాయి.

ADVERTISEMENT
Latest Stories