డ్రగ్స్ కేసులో కీలకంగా మారిన హీరోయిన్ ఛార్మి మరియు ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ ముమైత్ ఖాన్ ల సిట్ విచారణ ఒకే విధంగా ముగిసాయి. హైకోర్టులో ఛార్మి వేసిన పిటిషన్ రీత్యా సాయంత్రం అయిదు గంటల వరకే విచారణ చేయాలన్న నిబంధనతో, ముమైత్ కు కూడా ఇది కలిసి వచ్చింది. దీంతో ఆరు గంటల పాటు విచారణ అనంతరం ఛార్మి మాదిరే ఉల్లాసంగా బయటకు వచ్చిన ముమైత్ ఖాన్, మీడియాకు ‘థమ్సప్’ సింబల్ ను చూపించింది.
మునుపటి రోజున సిట్ విచారణ అనంతరం బయటకు వచ్చిన హీరోయిన్ ఛార్మి ఎంతో ఉత్సాహంగా మీడియాకు చేతులు ఊపుతూ ‘టాటా’ చెప్పిన విషయం తెలిసిందే. ఇక విచారణ తర్వాత మళ్ళీ ‘బిగ్ బాస్’ హౌస్ కు ముమైత్ పయనమైనట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ ప్రతినిధులు ముమైత్ వెంటే ఉండి, కనీసం మొబైల్ కూడా ఆమె దరి చేరకుండా చూసుకున్నట్లు సమాచారం. ఇంతకీ విచారణలో ముమైత్ ఏం చెప్పింది? అంటే…
యాజిటిజ్ గా ఛార్మి ఏం చెప్పిందో దాదాపుగా ముమైత్ కూడా అదే జవాబులను వెల్లడించినట్లుగా మీడియా వర్గాలు చెప్తున్నాయి. తాను డ్రగ్స్ తీసుకోనని, పబ్ లకు వెళ్తాను గానీ, అక్కడ ఎప్పుడు డ్రగ్స్ చూడలేదని… ఇలా అన్నింటికీ సమాధానం చెప్పిన ముమైత్… చివరికి బ్లడ్ శాంపిల్స్ తదితర వాటికి ‘నో’ చెప్పి బయటకు వచ్చేసింది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండడం వలన ఛార్మి ఏం చెప్పింది అన్న విషయం ముమైత్ కు తెలియకపోవచ్చు గానీ, అదే తరహా జవాబులను ఇవ్వడం మాత్రం విశేషం.


