ప్రతి ఎన్నిక ఏపీకి ‘అగ్నిపరీక్షే’ ఎందుకు.?

AP 2029 Elections Amaravati Debate

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఇప్పటికి పుష్కర కాలం గడిచిపోయింది. 2014 మొదలైన ఈ విభజన గాయాలు ఇప్పటికి ఏపీని అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా కోలుకోనివ్వడం లేదు. 2014 రాష్ట్ర విభజన తో రాజధాని కూడా లేని రాష్ట్రంగా తెలంగాణ నుంచి బయటకొచ్చిన ఏపీ ఏవిధంగా ముందుకెళుతోంది.? దీన్ని ఎవరు ముందుండి నడిపిస్తారు.?

రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టె ఆ నాయకుడు ఎవరు అనే ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా అల్లుకోవడంతో 2014 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కి అంత్యంత కీలకంగా మారాయి. ఒక పక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వైసీపీ తో రంగంలోకి దిగిన జగన్ మరోపక్క జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్.

ADVERTISEMENT

ఇక వీరిద్దరి మధ్యన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న విజనరీ నేతగా చంద్రబాబు నాయుడు. ఈ ముగ్గురిలో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కి మార్గం చూపేదెవరు అంటే అటు పవన్ ఇటు ఏపీ ఓటర్లు బాబు కే ఓటేశారు, టీడీపీ కే పట్టం కట్టారు.

ఇక 2014 బాబు నాయకత్వంలో ముందుకెళుతున్న ఏపీ కి అమరావతి రాజధానిగా ప్రకటించబడింది. అయితే నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా అమరావతికి మద్దతు తెలిపింది. దీనితో 2015 అమరావతి ప్రకటన నుంచి 2019 ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయం వరకు రాజధానిగా అమరావతి అభివృద్ధికి పునాదులుపడ్డాయి.

దీనితో 2019 ఎన్నికలు ఏపీకి మరోసారి కీలకంగా మారాయి. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజధాని అమరావతిని మార్చేస్తాడంటూ టీడీపీ గగ్గోలు పెట్టింది. ఇప్పటికే అమరావతిలో వేలకోట్ల ప్రజా ధనం తో నిర్మాణాలు మొదలయ్యాయని, ఇటువంటి సమయంలో వైసీపీ రాక రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం అంటూ బాబు చెవిలో ఇల్లుకట్టుకుని మరి పోరాడారు.

కానీ రాజధాని అమరావతి పై జగన్ ఇచ్చిన హామీలను నమ్మి ఏపీ ఓటర్లు జగన్ ఒక్క ఛాన్స్ నినాదానికే మొగ్గు చూపారు. దాని ఫలితం ఐదేళ్లు అమరావతి అరణ్య రోధన చేసింది. ప్రభుత్వం అంటే కేవలం బటన్లు నొక్కడమే అని, పాలన అంటే కేవలం ప్రత్యర్థి పార్టీల నేతల మీద పగ తీర్చుకోవడమే అన్నటుగా వైసీపీ ఐదేళ్ల పాలన సాగింది.

జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఇక రాష్ట్రానికి తరలివచ్చిన పరిశ్రమలన్నీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టాయి. దేశంలోనే రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ పొరుగు రాష్ట్రాల ముందు అవమానాలు ఎదుర్కొంది. దీనితో 2024 ఎన్నికలు ఏపీకి మరో అగ్నిపరీక్ష మాదిరి తయారయ్యాయి.

అప్పులు చేస్తూ, రాష్ట్ర రాజధానిని సమాధి చేస్తూ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ని పణంగా పెట్టి కేవలం బటన్ నొక్కే జగన్ ప్రభుత్వం కావాలా.? రాజధాని నిర్మాణంతో పాటుగా రాష్ట్ర భవిష్యత్ పునర్నిర్మాణం కావాలా.? అంటూ ముందుకెళ్లిన కూటమి vs వైసీపీ లో ఏపీ ఓటర్లు వైసీపీ ని పాతాళానికి తొక్కి మరి కూటమికి పట్టం కట్టారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతి పునర్నిర్మాణం కావాలన్నా.? ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ కి ఒక భరోసా ఇవ్వాలన్న 2024 ఎన్నికలు ఏపీకి అత్యంత కీలకంగా మారడంతో ఒక్క ఆంధ్రా కే ఈ ఎన్నికల ఫోబియా ఎందుకు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.?

ఇక ఇప్పుడు తాజాగా 2029 ఎన్నికల నినాదం మావిగన్ vs అమరావతి అంటూ జగన్ ప్రకటించడంతో ఈ రాబోయే ఎన్నికలు కూడా ఆంధ్రాకు అగ్నిపరీక్షే కానుంది. ఇప్పటికే అమరావతిలో ఎన్నో నిర్మాణాలు అధికారులకు, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇక అమరావతిలో మౌలిక వసతుల కల్పన కూడా శర వేగంగా నడుస్తుంది.

ఇన్నర్ రింగ్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్స్ పేరిట అమరావతి లో రవాణా వ్యవస్థ ఒక గాడిన పడుతుంది. క్వాంటం కంప్యూటింగ్ తో అధునాత టెక్నాలజీ అమరావతిలో అందుబాటులోకి రానుంది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఏపీ భవిష్యత్ కూటమి అమరావతి – వైసీపీ మావిగన్ మధ్య రాజకీయ బందీగా నిలబడింది.

దీనితో 2029 ఎన్నికలు కూడా ఏపీ భవిష్యత్ కి అత్యంత కీలకంగానే మారనున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్ ఈ మావిగన్ అనే అగ్నిపరీక్షను దాటి ముందుకెళుతుందా.?

ADVERTISEMENT
Latest Stories