విశాఖ వేదికగా అలజడి సృష్టించాలనుకున్న వారిపై కేంద్రమంత్రి సుజనా చౌదరి తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యంగా జల్లికట్టును స్పూర్తిగా తీసుకుని ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ఆందోళన నిర్వహించాలనే వారి తీరుపై మాట్లాడుతూ… జల్లికట్టుకు – ప్రత్యేక హోదాకు సంబంధం లేదని, జల్లికట్టును స్పూర్తిగా తీసుకునేవాళ్ళు కోళ్ళు, పందుల పోటీలు పెట్టుకోవాలని ఆగ్రహించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ ఘాటుగా స్పందించారు.
“హోదాను అడ్డుకోవాలని చూస్తున్న సుజనా చౌదరే పంది, పందివైన నీతోనే గేమ్ మొదలు పెడతామని” చిన్నికృష్ణ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకమయ్యాయి. హోదా కోసం పోరాడుతున్న వైకాపా అధినేత వైఎస్ జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ ను విమర్శిస్తే చూస్తూ ఊరుకోబోమని, అరెస్టులతో ఉద్యమాన్ని అడ్డుకోలేరని, విద్యార్థుల అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున లేస్తుందని హెచ్చరికలతో కూడిన వ్యాఖ్యలు చేసారు.
రాజకీయంగా ఎన్ని విమర్శలైనా చేసుకోవచ్చు గానీ, ఒక కేంద్రమంత్రిని పట్టుకుని ‘పంది’ అని సంభోదించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. అందులోనూ తెలుగు సాహిత్యం పుష్కలంగా తెలిసిన ఒక వివేకవంతమైన రచయితగా ఉన్న చిన్ని కృష్ణ సదరు వ్యాఖ్యలు చేయడం అనేది, ప్రత్యేక హోదా అంశం ఎంత ఉద్వేగభరితంగా మారిందో అన్న విషయాన్ని సూచిస్తుంది.
#M9NewsWin1000 contest every Wednesday – Answer our Question and win Rs 1000 Paytm Gift vouchers #contest2 pic.twitter.com/Yx6Z5Wql50
— M9News (@M9News) January 23, 2017



