ఆంధ్రప్రదేశ్ టికెట్ ధరల అంశంలో జరుగుతోన్న రచ్చపై ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా భావించే మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు నోరు మెదపలేదు. గతంలో ఒకటి, రెండు సందర్భాలలో సున్నితంగా విజ్ఞప్తులు చేసారు గానీ, సమస్య బాగా ముదిరిపోయిన తర్వాత ఒక్క పలుకు పలకలేదు.
అయితే ఈ రోజు మాత్రం టికెట్ ధరలను పెంచి ఇండస్ట్రీ బాగోగులు చూశారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ లకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ కూడా ఏపీ విషయాన్ని లేవనెత్తలేదు. కేవలం తెలంగాణ గురించి మాత్రమే ప్రస్తావించారు.
ఇదే దీని ద్వారానే జగన్ సర్కార్ కు మరియు వైసీపీ నేతలకు చిరంజీవి ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారంటూ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ రిప్లై ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి అపకారం చేయబోయి, మొత్తం ఇండస్ట్రీకే నిప్పుపెట్టారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఏపీ విషయం చిరంజీవి ప్రస్తావించనప్పటికీ, “రాణి గారి పెద్ద కోడలు మంచిది అంటే చిన్న కోడలు గురించి ప్రత్యేకంగా చెప్పాలా?” అన్న సామెతను బహుశా బొలిశెట్టి గారు ఉపయోగించినట్లున్నారు. ఇదిలా ఉంటే సమస్యను పరిష్కరించడానికి వచ్చే వారంలో చిరంజీవి ఏపీ సీఎంను కలిసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
https://twitter.com/bolisetti_satya/status/1474633071760531457




