‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ వైద్యం చేసిన చిరంజీవి!

Chiranjeevi Visits Dasari Narayana Rao - Khaidi Success Meetసిల్వర్ స్క్రీన్ పై సెంటిమెంట్ ను పండించాలంటే… అది అందరి హీరోల వల్ల అయ్యే విషయం మాత్రం కాదు. చిరు, వెంకటేష్, మహేష్, తారక్ వంటి అతి కొద్దిమంది హీరోలు మాత్రమే అద్భుతమైన సెంటిమెంట్ ను పండించగలరు. అయితే నిజజీవితంలో కూడా అంత సెంటిమెంట్ గా ఉండగలిగితేనే, రీల్ లైఫ్ లో పలికించడం సాధ్యం అనిపించేలా చిరు నిరూపించారు. దర్శకరత్న దాసరి నారాయణరావును పలకరించడానికి వెళ్ళిన సమయంలో, మెగాస్టార్ ఏ విధమైన సెంటిమెంట్ ను పండించారో దర్శకుడు వివి వినాయక్ తాజాగా చెప్పుకొచ్చారు.

చిరంజీవి చెప్పిన మాటలకు దర్శకరత్న దాసరి నారాయణరావు ఎంత ఆనందం పొందారో మాటల్లో చెప్పలేమని అన్నారు. “సార్‌… మీరు పూర్తిగా కోలుకుని ఇంటికి వచ్చిన తరువాతనే ‘ఖైదీ నంబర్‌ 150’ విజయంపై థ్యాంక్స్ మీట్‌ పెడతాం. ఆడియో ఫంక్షన్‌ కు వచ్చి మాకు ఎంతో స్పూర్తినిచ్చిన మీరు, ఈ కార్యక్రమానికి కూడా వస్తే, మీరెంత ఆరోగ్యంగా ఉన్నారన్న విషయం అందరికీ తెలుస్తుంది” అని చిరంజీవి చెప్పడంతో… దాసరి కళ్ళల్లో అమితానందం కనిపించిందని వినాయక్ వివరించారు.

ADVERTISEMENT

నిజానికి ఆ క్షణమే దాసరి లేచి నడిచేస్తారేమో అనిపించిందని, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రానికి వచ్చిన కలెక్షన్ల గురించి, పేపర్ పై రాయించుకుని చూసి ఆనందించారని వినాయక్ తెలిపారు. తానూ కోలుకున్న తర్వాత ‘ఖైదీ నంబర్ 150’ వేడుకకు ఖచ్చితంగా వస్తానని దర్శకరత్న చెప్పినట్లుగా ఆ రోజే మెగాస్టార్ గారు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. మొత్తమ్మీద మెగాస్టార్ గారు ‘శంకర్ దాదా ఎంబిబిఎస్’ వైద్యాన్ని దాసరి వద్ద ప్రదర్శించినట్లున్నారు… అంటూ చమత్కరించడం నెటిజన్ల వంతయ్యింది.

ADVERTISEMENT
Latest Stories