సీఐఐ సదస్సు ఎఫెక్ట్… ఏపీకి పెట్టుబడుల వరద..!

CII Summit 2017 Visakhapatnamవిశాఖపట్నంలో ప్రారంభ‌మైన భాగస్వామ్య సదస్సు ఫ‌లితంగా రెండవ రోజు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు భారీగా పెట్టుబ‌డులు వ‌చ్చాయి. రెండవ రోజు ఏకంగా 10.25 లక్షల కోట్ల పెట్టుబడులకు పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఈ సదస్సులో కుదిరిన 665 అవగాహన ఒప్పందాల ఫ‌లితంగా అమరావతికి భారీగా పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో మొత్తం 22 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొర‌క‌నున్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సీఆర్‌డీఏ పరిధిలో మొత్తం 1.29 లక్షల కోట్ల విలువైన 62 ఒప్పందాలు కుదిరాయ‌ని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. అందులో రచన సాయి ఇన్‌ ఫ్రాటెక్‌ తో 2500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింద‌ని, దీంతో 15 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. రామకృష్ణ హౌసింగ్‌ లిమిటెడ్‌ తో 5వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింద‌ని, దీంతో 2వేల మందికి ఉపాధి ల‌భిస్తుంద‌ని సమాచారం.

ADVERTISEMENT

షాపూర్జీ – పల్లోంజీ లతో 6 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింద‌ని, దీని ద్వారా 10 వేల మందికి ఉపాధి దొరుకుతుంద‌ని చెప్పారు. ఇక‌ టాటా పవర్‌ కంపెనీతో రాష్ట్రానికి 12,500 కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందం కుదిరింద‌ని, దీంతో 3 వేల మందికి ఉపాధి అవకాశాలు, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ పెట్టుబడులతో 6365 మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌ని చెప్పారు.

ADVERTISEMENT
Latest Stories