సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి, సర్కారు వారి పాట యొక్క నిర్మాతలకు కరోనా వాక్సిన్ వచ్చే వరకు తాను షూటింగ్ మొదలు పెట్టె అవకాశం లేదని స్పష్టం చేశారట. ఒకవేళ వారు తప్పదు అనుకుంటే… తాను అవసరం లేని భాగాలను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆయన కోరారు.
అయితే ఈ ఆలస్యం కారణంగా సినిమా సినిమాటోగ్రాఫర్‌లో మార్పు జరిగింది. టాప్ సినిమాటోగ్రాఫర్ పిఎస్ వినోద్ ఈ సినిమాకు కెమెరా ను హేండిల్ చెయ్యాల్సి ఉంది. అయితే ఈ ఆలస్యం కారణంగా అతని డేట్స్ పూర్తిగా వేస్ట్ కావడంతో అతను చిత్రం నుండి బయటకు వెళ్లాడు. అతని స్థానంలో శ్రీమంతుడు కోసం పనిచేసిన మధీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.
మహేష్ సొంత బ్యానర్‌తో పాటు మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తమన్ పని చేస్తున్నారు. ఈ చిత్రానికి పాటల రికార్డింగ్‌ను ఆయన త్వరలో ప్రారంభిస్తారు. ఈ చిత్రాన్ని ఉగాది 2021 కోసం మేకర్స్ ముందే ప్లాన్ చేసినప్పటికీ ఇప్పుడు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
ఈ చిత్రంలోని హీరోయిన్ ని ఇప్పటిదాకా ఖరారు చెయ్యలేదు. అప్పట్లో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ అని వినిపించినా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పట్లో షూటింగ్ మొదలయ్యే అవకాశం లేకపోవడంతో నిర్మాతలలో ఎటువంటి కంగారు లేదు.





