అదే చిక్కటి చిరునవ్వు!చెప్పండయ్యా బాబు!

CM Jagan

రైలు ప్రమాద బాధితులను పరామర్శించడానికి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాధితులు కన్నీటితో తమ ఆవేదనను చెప్పుకుంటుంటే అదే చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ బాధితులకు తన అభయహస్తంతో భరోసా అందించిన వీడియోలు ఇప్పుడు సామజిక మాధ్యమాలలో ట్రెండ్ అవుతున్నాయి.

ఒక సందర్భంలో పవన్ మాట్లాడుతూ పెళ్లి కెళ్ళు ఒకటే నవ్వు,ఎవరైనా చనిపోతే పరామర్శించడానికి వెళ్లు అదే నవ్వు. ఎవైరైన చెప్పడయ్యా ఆయనకు అలా నవ్వకూడదని, తండ్రి కృష్ణ గారు చనిపోయి మహేష్ పుట్టేడు దుఃఖంలో ఉంటే అక్కడికి వెళ్లి మహేష్ ని చూసి అదే షిక్కటి చిరునవ్వు చిందిస్తారు అంటూ పవన్ సీఎం జగన్ తీరు పై విమర్శలు
చేసిన వీడియో కూడా జనసైనికులు ఇప్పుడు వైరల్ చేసే పనిలో బిజీగా ఉన్నారు.

ADVERTISEMENT

ప్రమాదం జరిగి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్న బాధితుల దగ్గరకు వెళ్లిన జగన్ వారిని పరామర్శించి నేను ఉన్నాను అంటూ ధైర్యం చెప్పి బాధితులకు అండగా నిలవాల్సింది పోయి వారు కన్నీటితో తమగోడు చెప్పుకుంటూ ఉంటే అది చూసి ఎలా నవ్వగలుగుతున్నారు అంటూ సామజిక మాధ్యమాలలో జగన్ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. హృదయ విదారకమైన దృశ్యాలు చూస్తున్న మానవత్వం ఉన్న ఎవరి కళ్ళైనా చమర్చక మానవు. అటువంటి సందర్భాలలో కూడా నవ్వులు చిందిస్తాడు కాబట్టే లోకేష్ జగన్ ను సైకో సీఎం అంటూ సంబోధిస్తారు అంటూ టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు.

ఈ ఒక్క సందర్భంలోనే కాదు జగన్ చేపట్టిన ఓదార్పు యాత్రలో కూడా మరణించిన కుటుంబాల వద్దకు వెళ్లి ఇలానే నవ్వులు చిందించేవారు, అలాగే కరోనా సమయంలో మరణం అంచులదాకా వెళ్లి వచ్చిన వారి వద్దకు వెళ్లి అదే నవ్వు, వరదల సమయంలో ఆయా ప్రాంతాలను సందర్శించి పంటలు కోల్పోయిన రైతుల వ్యధలు చూసి అదే నవ్వు, అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నాయకులు ప్రతిపక్ష నేతల ఆడవారి పై దిగజారుడు విమర్శలు చేస్తున్నా కూడా అదే నవ్వు.

నవ్వు ఆరోగ్యానికి ఎంత మేలో అదే నవ్వు నాలుగు విధాలా చేటు కూడా చేస్తుంది. సమయం సందర్భం లేకుండా నవ్వితే ప్రతిపక్ష నేతల ఆరోపణలకు జగన్ నవ్వే సాక్షిగా మిగులుతుందని ఇప్పటికైనా గ్రహించాలంటూ, మీలో ఎవ్వరైనా ఆయనకు చెప్పండయ్యా అంటూ సోషల్ మీడియాలో వైసీపీ నేతలకు సలహాలిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories