పవన్ కళ్యాణ్ దెబ్బకు ఏకాకులుగా మిగిలిన కమ్యూనిస్టులు

Communists beware of pawan kalyanజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో సొంతంగా పోటీ చెయ్యబోతున్నట్టు ప్రకటించారు. దీనితో పవన్ కళ్యాణ్ తో జత కట్టి రెండు సీట్లు గెల్చుకుందాం అనుకున్న కమ్యూనిస్టుల ఆశలు అడియాశలు అయ్యాయి. పవన్ కళ్యాణ్ కలిసి వస్తాడనుకుని కమ్యూనిస్టులు టీడీపీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్ తో విరోధం పెట్టుకున్నారు.

ఇప్పటికి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఏవో విమర్శలు చేస్తూనే ఉంటారు. దీనితో టీడీపీతో పొత్తు దాదాపుగా లేనట్టే. బీజేపీతో ఉన్న సైధ్యాంతిక వైరుధ్యం వల్ల వారితో పొత్తు ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్ తో జతకట్టినా పెద్దగా ఉపయోగం లేదు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ మీద కూడా తరచుగా విమర్శలు చెయ్యడంతో వారితోనూ పెద్దగా మంచి సంబంధాలు లేవు.

ADVERTISEMENT

పైగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే వచ్చే ఎన్నికలలో ఎటువంటి పొత్తులు ఉండవని స్పష్టం చేసారు. దీనితో 2014 మాదిరిగానే ఒంటరిగానే వెళ్ళాల్సి రావొచ్చు. అదే జరిగితే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం ఉండకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories