
రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ వద్ద నిర్ధిష్ట కాలానికి మించి అట్టేబెట్టుకోకూడదనే సుప్రీంకోర్టు తీర్పులో మంచి చెడులపై రాజ్యాంగ, న్యాయ నిపుణులు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఇంకా చర్చిస్తుండగానే, తమిళనాడులో అధికార డీఎంకె ప్రభుత్వం గవర్నర్ వద్ద 10 నెలలుగా పెండింగులో ఉన్న 10 బిల్లులకి చట్ట రూపం కల్పిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే గవర్నర్ ఆమోద ముద్ర లేకుండానే అవన్నీ చట్టరూపం దాల్చాయన్న మాట!
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ దిశలో అడుగు వేయబోతున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సంకేతం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్స్ 42 శాతానికి పెంచుతూ ఇటీవల శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రపతి ఆమోదం కొరకు పంపింది.
Also Read – వైసీపీ చేపల వేట ఫలించేనా?
ఇదివరకైతే రాష్ట్రపతి దానిని పక్కన పెట్టేయగలిగేవారు. కానీ రాష్ట్రపతి కూడా తన ఆమోదం కోసం వచ్చిన బిల్లులపై రెండు నెలల్లోగా నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, లేకుంటే రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
కానీ బీసీ రిజర్వేషన్స్ 42 శాతానికి పెంచాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దీని కోసం సవరణ చేస్తే దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి రిజర్వేషన్స్ పెంపు కోసం కొత్త కొత్త డిమాండ్స్ పుట్టుకొస్తాయి. దాని వలన మళ్ళీ రిజర్వేషన్స్ అనుకూల-వ్యతిరేక ఉద్యమాలు మొదలవుతాయి. కనుక కేంద్రం ఎట్టి పరిస్థితులలో రాజ్యాంగ సవరణ చేయదు.
Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?
కానీ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించి పంపిన బిల్లుపై రాష్ట్రపతి తప్పనిసరిగా 2 నెలల్లో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తీసుకోకపోతే తెలంగాణ ప్రభుత్వం కూడా తమిళనాడు ప్రభుత్వంలాగే ఆ బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం పొందిన్నట్లుగా పరిగణించి చట్ట రూపం కల్పించి అమలుచేసే అవకాశం ఉంది.
కానీ రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్స్ 50 శాతం మించకూడదనే నిబంధన ఉంది. కనుక దీనిపై అభ్యంతరం చెపుతూ పిటిషన్లు దాఖలైతే అప్పుడూ సుప్రీంకోర్టే విచారించి తీర్పు చెప్పాల్సి ఉంటుంది.
Also Read – కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?
రాష్ట్రపతి, గవర్నర్ పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు తాజా తీర్పుని తమిళనాడు ప్రభుత్వం దిగ్విజయంగా ఉపయోగించుకుంది. కనుక దేశంలో మిగిలిన రాష్ట్రాలు కూడా బహుశః త్వరలోనే ఇటువంటి ప్రయత్నం చేయవచ్చు. వాటిలో ముందుగా తెలంగాణ ప్రభుత్వం సిద్దంగా ఉంది. కనుక సుప్రీంకోర్టు తాజా తీర్పుపై కేంద్ర ప్రభుత్వం ఏవిదంగా స్పందిస్తుందో?