ఎల్లారెడ్డి తాజా మాజీ తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఏనుగు రవీంద్ర రెడ్డి ఓటర్లతో భేరసారాలు జరుపుతూ కెమెరాకు చిక్కారు. ఇప్పుడు ఆ వీడియో మీడియాకు పొక్కి సంచలనం సృష్టిస్తుంది. ఒక గ్రామంలో పర్యటిస్తున్న ఆయనకు మహిళా సంఘాలు ఎదురెళ్లి తమ కార్యకలాపాలకు భవనం కావాలని అడిగారు.
[m9ad]
అయితే ఆయన ఐదు లక్షలు ఇప్పిస్తాను అని, మీ గ్రూపులు అందరు మీటింగు పెట్టుకుని తెరాసకే ఓటు వేస్తామని నన్ను గెలిపిస్తామని, కేసీఆర్ ను సీఎం చేస్తామని తీర్మానం చెయ్యండి అంటూ వారికి ఆఫర్ ఇచ్చారు. ఐదు లక్షలకు ఏం వస్తుందని వారు అడగడంతో మొదటి విడతగా అని ఎమ్మెల్యే విడమర్చి చెప్పారు.
అయితే ఈ సంగతిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధం అవుతుంది కాంగ్రెస్ పార్టీ. ఓటర్లను ప్రలోభ పెట్టి ఆపద్ధర్మ ప్రభుత్వం నియమాలను ఉల్లంఘించి ఎన్నికలలో గట్టెక్కలని చూస్తున్నారని వారి ఆరోపణ. దీనిపై ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి…



