మేము చెప్పేదేంటి? మీరు అడిగేదేంటి? ఏమో మేడం మాకు కనపడదు!

Daggubati Purandeswariప్రజలు అధికారం ఇచ్చింది రాష్ట్ర హక్కులను కాపాడడానికా?లేక ప్రతిపక్ష పార్టీల హక్కులను కాలరాయడానికా? అన్నట్లు వైసీపీ నేతల రాజకీయ చర్యలు ఉంటున్నాయి. రాష్ట్రంలో బలంగా ఉన్న ప్రతిపక్షాలైనా టీడీపీ , జనసేన పార్టీల నాయకులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఏదైనా విమర్శ చేసినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెచ్చినా వైసీపీ నాయకుల సమాధానం ఒక్కటే విపక్ష పార్టీల నేతలను బూతులు తిట్టడం, వారి ఇంట్లో ఆడవారిని అవమానించడం.

ప్రభుత్వం ఇచ్చిన హామీల మాటేమి అంటూ అడిగితే ఏమో సార్ మాకు కనపడదు, వినపడదు అంటూ మాటదాటేసే పరిస్థితే రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీనిలో వైసీపీ నాయకులే కాదు ఆయనకు మద్దతు పలికే మీడియా తీరు కూడా ఇలానే ఉండడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచిన ఇంతవరకు ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదు, ఇక నిర్వహిస్తారు అన్న ఆశ కూడా లేదు. వైసీపీ నేతలు పెట్టె ప్రస్ మీట్లలో కూడా మీడియాకు కొన్ని ఆంక్షలు, పరిమితులు ఉంటాయి అనేది బయట నడుస్తున్న టాక్. కొన్ని మీడియా ఛానళ్లకైతే అనుమతే దొరకని పరిస్థితి.

ADVERTISEMENT

కానీ ప్రతిపక్ష నేతలు పెట్టె ప్రెస్ మీట్లకు మాత్రం సదరు మీడియా ఛానళ్లు హాజరయ్యి ఇష్టానుసారంగా ఆ సందర్భానికి సంబంధంలేని ప్రశ్నలను సంధిస్తుంటారు. ఉదాహరణకు లోకేష్, పవన్ ప్రెస్ మీట్లలో అక్కడ వాళ్ళు చెప్పాలనుకునేది ఒకటి కానీ వీళ్ళు వినాలనుకునేది మరొకటి ఉంటుంది.అక్కడ జరిగేది ఒకటి ఇక్కడ వీళ్ళు చెప్పేది మరొకటి.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన మద్యపాన నిషేధం మాటేమయ్యింది? రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసిన తరువాతే 2024 ఎన్నికలలో ప్రజల ముందుకెళ్లి ఓట్లడుగుతాము అంటూ చేసిన జగన్ శబదలా మాటేమిటి?అంటూ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అలాగే ఈ రాష్ట్రంలో మద్యం వ్యాపారం చేస్తున్న కంపెనీల యజమానులు పేర్లు సాయంత్రం లోగా ప్రభుత్వం ప్రజల ముందు ఉంచగలదా? ఈ సవాల్ ను ప్రభుత్వం స్వీకరించగలదా? అంటూ ప్రభుత్వ హామీల అమలు కోసం పురందరేశ్వరి మీడియా ముందు వస్తే అదే అదునుగా కొన్ని పత్రికల విలేకరులు వీటి మీద ప్రశ్నలు సందించకుండా మీరు లోకేష్ అమిత్ షా ను ఎందుకు కలిసారు? షా ఏమన్నారు? లోకేషే షాను కలిసారా? షానే లోకేష్ ను పిలిపించారా? అంటూ సందర్భాన్నికి సంబంధం లేని ప్రశ్నలతో పురంధరేశ్వరిని ముప్పతిప్పలు పెట్టాలని భావించారు.

కానీ రాజకీయాలలో ఆరితేరిన పురందరేశ్వరి వాటన్నిటికీ కలిపి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కేంద్ర హోమ్ మంత్రికి వివరించాం. అమితాషా కూడా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితుల గురించి ఆయన మీద వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి లోకేష్ ను అడిగి తెలుసుకున్నారు అంటూ సమాధానం చెప్పారు. ఇక్కడ ఎవరు ఎవరిని పిలిచారు అన్నది అప్రస్తుతం అంటూ సదరు విలేఖరికి బదులిచ్చారు.

రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి అంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైసీపీ ప్రభుత్వం మాట తప్పింది అంటూ విపక్ష నేతలు మీడియా ముందుకు వస్తే వాటిలో నిజానిజాలను ప్రజల ముందు ఉంచాల్సిన మీడియా “ఏమో మేడం అవి మాకు కనపడవు” అంటూ రాజకీయ నేతల మాదిరి ప్రశ్నలను పక్క దారి పట్టించడం వారి వృత్తికి ద్రోహం చేసినట్టే అనేది సదరు మీడియా వారు గ్రహించాలి.

ADVERTISEMENT
Latest Stories