ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్వాయ్ కి తృటిలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం విద్యుదాఘాతంలో దగ్ధమైంది. కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో వాహనంలోని ఆరుగురు ఎస్కార్ట్ సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.
దీంతో ఎస్కార్ట్ వాహనం పూర్తిగా దగ్ధమైంది. నర్సీపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే జన్మభూమి-మా వూరు కార్యక్రమానికి హాజరయ్యేందుకు చినరాజప్ప వెళ్తుండగా విశాఖ జిల్లాలోని కొండల అగ్రహారం వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో చినరాజప్ప కాన్వాయ్‌లో లేరని తెలుస్తోంది.
ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానిక పోలీసులు హూటాహుటిన ఘటనాస్థలికి బయలుదేరారు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు, చినరాజప్పతో ఫోన్‌లో మాట్లాడారు. ఘటనపై ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.



