అక్కడ అభివృద్ధికి.. ఇక్కడ సంక్షేమానికి.. అప్పులు

Development in Telangana welfare schemes here and debtsహైదరాబాద్‌కు అనేక జాతీయ అంతర్జాతీయ ఐటి కంపెనీలు,వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు భారీ పెట్టుబడులతో తరలివస్తున్నాయి. ఏపీ వేరే రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్ళు కావస్తున్నప్పటికీ నేటికీ ఏపీకి రాజధాని లేదు. కానీ తెలంగాణలో రాజధాని హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర జిల్లాలను అక్కడి ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది.

ఎక్కడికక్కడ ఐటి కంపెనీలు, ఐటీ-హబ్‌లు, పారిశ్రామికవాడలు, హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌కు ధీటుగా మినీ ట్యాంక్‌ బండ్‌లు, పార్కులు, కేబిల్ బ్రిడ్జిలు నిర్మించుకొంటోంది. ముప్పై మూడు జిల్లాలలో విదేశాలకు తీసిపోనివిదంగా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాలు, రైతు బజారులు నిర్మించుకొంటోంది.

ADVERTISEMENT

కరోనా నుంచి గుణపాఠాలు నేర్చుకొని వైద్యరంగాన్ని కూడా చాలా బలోపేతం చేస్తోంది. ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్‌, బస్తీ దవాఖానాలు, సూపర్ స్పెషాలిటీ, హాస్పిటల్స్‌ నిర్మించుకొంటోంది. ఉచిత వైద్య పరీక్షలు, డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. రూ.2,679 కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్‌ నాలుగు దిక్కులలో నాలుగు టిమ్స్ (తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ మెడికల్ సైన్సస్) నిర్మించుకొంటోంది.

మొన్నటి దాక మూడు రాజధానులంటూ కాలక్షేపం చేసిన జగన్ సర్కారు ఆనాడు అమరావతిలో చంద్రబాబునాయుడు కట్టించిన తాత్కాలిక సచివాలయంలోనే కూర్చొని పరిపాలన చేస్తుంటే, తెలంగాణ సిఎం కేసీఆర్‌ సుమారు రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన కొత్త సచివాలయం, రూ.450 కోట్లు పెట్టి పోలీస్ కమాండ్ కంట్రోల్ టవర్స్ వగైరా నిర్మించుకొంటున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు…ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తూనే ఉంది.

ఒకప్పుడు సాగు,త్రాగు నీటి కోసం కటకటలాడిపోయిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏడాది పొడవునా గలగల నీళ్ళు ప్రవహిస్తున్నాయి. ఒకప్పుడు రాష్ట్రంలో రైతులు లక్షలాది బోరుబావులు తవ్వించి వాటిలో నీళ్ళు పడక అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకొనేవారు. ఇప్పుడు బోరుబావుల అవసరమే లేదు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులు పూడిక తీయించి వాటిలో నీళ్ళు నింపుతుండటం వలన, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పారుతున్న కాలువల కారణంగా ఎండిపోయిన బోరు బావులలో సైతం ఇప్పుడు పాతాళగంగ ఉబికి వస్తోంది. ఆ బోరుబావుల వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇస్తోంది.

గతంలో ఇటువంటివన్నీ నేతల నోట్లో వాగ్ధానాలలో లేదా ప్రతిపాదనల రూపంలో ప్రభుత్వ ఫైల్స్‌లో లేదా శిలాఫలకాలలో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు ఇవన్నీ కళ్లెదుట ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు కూడా. తెలంగాణ రాష్ట్రం అంటే అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌ అని చెప్పక తప్పదు.

ఇంతకీ ఇవన్నీ ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, తెలంగాణ పురపాలక, ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ నిన్న ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “మీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకు ఇంతగా అప్పులు చేస్తోంది?” అనే ప్రశ్నకు ఆయన చెప్పిన ఈ చిన్న సమాధానమే.

“మేము పరిమితులకు లోబడి అప్పులు తీసుకొని దానిని కేవలం అభివృద్ధి పనుల కోసమే వినియోగిస్తూ రాష్ట్రానికి ఎన్నటికీ తరగని సంపద సృష్టిస్తున్నాము. దాంతో ప్రస్తుత, భవిష్యత్‌ తరాలు కూడా సుఖసంతోషాలతో జీవిస్తారు. రాష్ట్ర నిర్మాణం, అభివృద్ధి కోసం చేసే అప్పులు పెట్టుబడిగా భావించవచ్చు,” అని అన్నారు.

కేవలం ఏడున్నరేళ్ళలో తెలంగాణ రాష్ట్రం ఎంతగా అభివృద్ధి చెందిందో, ఎంత సంపద సృష్టించిందో అంతా కళ్లెదుటే ఉంది. కానీ ఏపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ఆలోచన చేయకుండా సంక్షేమ పధకాల కోసం అందినకాడికి అప్పులు చేసుకుపోతోంది. కనుక తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చెప్పింది చెవిలో వేసుకొని ఇప్పటికైనా తీరు మార్చుకొని ఆ దిశలో పని ప్రారంభిస్తే మంచిది లేకుంటే ఏదో ఓరోజు ఏపీ కూడా శ్రీలంకలా మునిగిపోవడం ఖాయం.

ADVERTISEMENT
Latest Stories