devi-sri-prasad Music in Thandel

ప్రేమ కథా చిత్రాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రాణం పోస్తుంది అని మరోసారి నిరూపించుకున్నారు దేవి. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా వచ్చిన తండేల్ మూవీ సక్సెస్ లో దేవి పాత్ర కీలకం అనేది మూవీ చూసిన ప్రతి ఒకరి అభిప్రాయంగా వినపడుతుంది.

బుజ్జి తల్లి, హైలెస్సో హైలెస్సా అంటూ సాగే పాటల నుంచి ఆ మూవీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు దేవి తన సంగీతంతో ప్రేక్షకులను కట్టిపడేసారు. పుష్ప వంటి ప్రెస్టేజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తో మమేకమైనప్పటికీ అటు పుష్ప మూవీ కి న్యాయం చేసారు,అలాగే ఇటు తండేల్ మూవీ కి ప్రాణం పోశారు.

Also Read – రేవంత్ రెడ్డి…మరో జగన్ రెడ్డి కానున్నారా.?

పుష్ప- 1 సినిమాలో దేవి ఇచ్చిన పాటలు శ్రీవల్లి, సామి సామి, ఊ..అంటావా ఉహు అంటావా.? ఏ బిడ్డా ఇది నా అడ్డా, ఇలా ఏ పాటకాపాటే ప్రత్యేకంగా నిలిచాయి. అలాగే ఆ పాటలు ఇతర దేశాల స్టార్ క్రికెటర్స్ ను కూడా ఆకర్షించి పుష్ప తగ్గేదేలే అనేలా పాన్ వరల్డ్ క్రెజ్ ను తీసుకువచ్చాయి. ఇక దాని కొనసాగింపుగానే పుష్ప -2 సక్సెస్ లో కూడా దేవి భాగమయ్యారు.

దీనితో సుకుమార్ తన పేరు సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ అంటూ దేవి లేకుండా ఇంతవరుకు సినిమాలు తీయ్యలేదు,ఇక ముందు కూడా తియ్యలేనేమో అంటూ దేవికి తనకు ఆమధ్య ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఆర్య తో మొదలైన సుక్కు, దేవి ల కాంబో పుష్ప వరకు నిర్వీరంగా కొనసాగుతూ వస్తు ఇక ముందు కూడా కొనసాగుతుంది అని తెలియచేసారు సుక్కు.

Also Read – వైసీపీ కి జనసేన… బిఆర్ఎస్ కు బీజేపీ..?

అలాగే ప్రేమ కథ అనగానే దర్శకుడు ముందు ఆలోచన దేవి శ్రీ ఉండాల్సిందే అనేలా గతంలోనే తన మార్క్ చూపించారు దేవి. ఇప్పుడు ఆ మ్యాజిక్ ను తండేల్ తో మరోసారి నిరూపించుకున్నారు. సుక్కు శిష్యుడు బుచ్చిబాబు ఇండస్ట్రీ అరంగేట్రం కూడా ఉప్పెన అనే ప్రేమ కథతోనే మొదలయ్యింది.

అయితే ఈ మూవీలో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, దర్శకుడు బుచ్చిబాబు ఇలా అందరు కొత్తవాళ్లే అయినప్పటికీ ఆ మూవీ 100 కోట్ల మార్కును అందుకుంది. ఇందులో సింహ భాగంగా రిలీజ్ కు ముందే ఆ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచి యూత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించి వారిని థియేటర్ల వరకు రప్పించింది.

Also Read – వాళ్ళు పొట్టి శ్రీరాములుని వద్దనుకున్నారు కానీ మనం..


అలాగే ఇప్పుడు చై తండేల్ మూవీ కూడా థియేటర్లలో దుళ్లగొట్టేస్తుంది అంటూ చిత్ర యూనిట్ ఈ మూవీ ఇప్పటికే 70 కోట్ల మార్క్ ను అందుకుంది అంటూ ప్రకటించారు. అయితే ఈ మూవీ విజయం వెనుక కూడా దేవి మ్యూజిక్ మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. ఇలా ఇండస్ట్రీ వర్గాలంతా దేవి పనైపోయింది అనుకున్న ప్రతిసారి తానేంటో నిరూపిస్తునే వస్తున్నారు దేవి..!