స్వర్గీయ దేవినేని నెహ్రూ వారసుడు దేవినేని నెహ్రూ సేవలను ఉపయోగించుకోవాలని టీడీపీ నాయకత్వం భావిస్తుంది. గతంలో యువజన కాంగ్రెస్ బాధ్యతలు నిర్వర్తించిన అవినాష్‌కు టీడీపీలో కూడా యువత బాధ్యతలు అప్పగించటానికి పార్టీ సిద్ధమవుతోంది. జిల్లా పార్టీ నుంచి ఏకాభిప్రాయం రావటంతో అవినాష్ పేరును ప్రతిపాదించినట్టు సమాచారం.
గతంలో దేవినేని నెహ్రూ టీడీపీలో జాయిన్ అయ్యే టైంలో నెహ్రూ ఎలాంటి షరతులు పెట్టకపోయినా తన కుమారుడు అవినాష్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీ సౌలభ్యం మేరకు న్యాయం చేయండి అని సీఎంను కోరారు. తరువాత నెహ్రూ మరణించినా మాట నిలబెట్టుకోవాలని చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకుంటున్నారు.
కింది స్థాయి నుంచి పై స్థాయి నాయకులు, నెహ్రూ అభిమానులు, నెహ్రూ కార్యకర్తలు, యూఎస్‌ఓ విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థులలో అవినాష్ ఫాలోయింగ్ బానే ఉంది. 2019లో ఏదో ఒక నియోజకవర్గం నుండి అవినాష్ ను నిలబెట్టడం కూడా దాదాపుగా ఖాయం అయిపోయిందట.



