అంబటి సొంత పార్టీ నేతలనే “వెన్నుపోటు” పొడిచారా.?

Ambati Rambabu

కులం పేరుతో రాజకీయాలు చేస్తూ, పక్క పార్టీల నేతల మీద సెటైరికల్ ట్వీట్స్ వేసే మంత్రి అంబటి రాంబాబు పై ఇప్పుడు సొంత పార్టీ కార్యకర్తలే సెటైర్లు వేస్తున్నారు. స్థానిక ఇంచార్జ్ ల మార్పుతో సత్తెనపల్లి వైసీపీ నాయకత్వంలో కూడా జగన్ మార్పు చేస్తారని ఆశించిన వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులకు జగన్ నిరాశే మిగిల్చారు.

2024 ఎన్నికలలో సత్తెనపల్లి నుండే అంబటి ఎన్నికల బరిలోకి దిగుతారంటూ వార్తలు రావడంతో ఎలర్ట్ అయినా సత్తెనపల్లి వైసీపీ కార్యకర్తలు తాడేపల్లి వైసీపీ కార్యలయం వద్ద అంబటికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియచేసారు. వెన్నుపోటుకి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ నిత్యం విమర్శలు చేసే అంబటికి ఆయన సొంత పార్టీకి, పార్టీ శ్రేణులకు చేసిన వెన్నుపోటుని బయటపెట్టారు స్థానిక వైకాపా నేతలు.

ADVERTISEMENT

ఈ “సంబరాల రాంబాబు మాకు వద్దు”…అంటూ నినాదాలు చేస్తూ గత నాలుగున్నరేళ్లుగా స్థానికంగా అంబటి చేసిన దౌర్జన్యాలను తెలియచేసారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను పక్కన పెట్టి సొంత పార్టీలోనే రెండు వర్గాలను తయారుచేసి అటు పార్టీకి ఇటు స్థానిక వైసీపీ కార్యకర్తలకు అంబటి వెన్నుపోటు పొడిచారంటూ వైకాపా నేతలు అంబటి పై తమ నిరసన దాడిని కొనసాగించారు. నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేసే వారిని పక్కన పెట్టి బ్రోకర్లను నియమించుకుని, మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని దోపిడీలకు పాల్పడుతున్నాడంటూ తమ ఆవేదనను వినిపించారు.

సినిమా రివ్యూ ల మీద ఉన్న ఆసక్తి, ప్రత్యర్థి నేతల మీద విమర్శలు చేయాలనే ఆత్రుత, అలాగే పక్క పార్టీ కార్యక్రమాల మీద ఉండే శ్రద్ద సొంత పార్టీ కార్యకర్తల కష్టం మీద ఉంచితే అంబటికి ఇప్పుడు ఈ నష్టం జరిగి ఉండేది కాదని స్థానిక నేతల నుండి వినపడుతున్న మాట. పవన్ కూర్చున్న కొమ్మని నరుకుంటున్నాడు అంటూ X లో తెగ బాధపడిపోయిన అంబటికి ఇప్పుడు నమ్మి ఓటేసిన ప్రజల నమ్మకాన్ని కూల్చేసిన విషయం తెలియలేదా? ఇప్పటికైనా సామజిక మాధ్యమాలలో కాకుండా సమాజంలో ఉండమని హితవు పలుకుతున్నారు స్థానిక వైకాపా నేతలు.

ADVERTISEMENT
Latest Stories