నువ్వు విష్ణువైతే.. నేను గంటా!

Differnces Between Vishnu Kumar Raju and Ganta Srinivasa Rao

విశాఖలో బీజేపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరిచయం అక్కర్లేని వ్యక్తి. సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే మంచి పేరు కూడా ఉంది. ఇక భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు మాజీ మంత్రి. కనుక రాష్ట్ర ప్రజలందరికీ సుపరిచితులు.

వీరిరువురి మద్య భీమిలి నియోజకవర్గంలో ఫిల్మ్ క్లబ్ లీజ్ విషయంలో చిన్న వివాదం ఏర్పడింది. ఈరోజు వీరిరువురూ విశాఖలో ఓ కార్యక్రమంలో కలిసినప్పుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గంటాని పలకరించినా ఆయన ముభావంగా ఉండిపోయారు.

ADVERTISEMENT

ఆయన నియోజకవర్గంలోని ఫిల్మ్ క్లబ్ లీజ్ విషయంలో తాను జోక్యం చేసుకునందుకు ఆగ్రహం కలిగిందని విష్ణుకుమార్ రాజు గ్రహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కారులో బయలుదేరుతుండగా విష్ణుకుమార్ రాజు ఆయన వద్దకు వెళ్ళి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ఆగ్రహం చల్లారకపోగా ఇంకా పెరగిపోయింది.

అంత వరకు ముభావంగా ఉండిపోయిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మీడియా, అందరూ చూస్తుండగానే ఆయనపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అందుకు విష్ణుకుమార్ రాజు నొచ్చుకున్నప్పటికీ వినయంగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

కానీ గంటా శ్రీనివాసరావు మాత్రం ఆయన పరిస్థితి గమనించి తర్వాత మాట్లాడుకుండామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండి ఉంటే హుందాగా ఉండేది. కానీ నా నియోజకవర్గంలో ఉన్న ఫిల్మ్ క్లబ్ గురించి నాకు తెలియకుండా కలెక్టర్‌కి చెప్పడమే తప్పు. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమాపణలు చెప్పడం దేనికి?అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆయనపై విరుచుకుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

అంత మందిలో ఎమ్మెల్యే అయిన తనని సాటి ఎమ్మెల్యే గంటా ఆవిదంగా అవమానించినందుకు విష్ణు కుమార్‌ రాజు చాలా బాధ పడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడవలసి ఉంది కానీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు.

ఇంతకీ వారి మద్య వివాదం ఏమిటంటే, గతంలో గంటా మంత్రిగా ఉన్నప్పుడు చొరవ తీసుకొని భీమిలిలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేయించారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఆ భూమిని, దానిలో నిర్మించిన భవనాలను తమ అధీనంలో తీసుకొని కబ్జా చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు గంటాతో పాటు విష్ణు కుమార్‌ రాజు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ సాధ్యపడలేదు.

మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గంటా శ్రీనివాసరావు వైసీపీ నేతల చేత ఫిల్మ్ క్లబ్ పదవులకు రాజీనామాలు చేయింకాహారు. వారు వ్రాసుకున్న ఫిల్మ్ క్లబ్ లీజుని రద్దు చేయించి మళ్ళీ ప్రభుత్వం అధీనంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ వ్యవహారం గురించి విష్ణు కుమార్‌ రాజు జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్ళడంతో ఆయన గంటాని సంప్రదించారు. అప్పుడే ఆయనకు విష్ణు కుమార్‌ రాజు కూడా ఈ వ్యవహారంలో వేలు పెడుతున్నారని గ్రహించి ఆయనపై ఫైర్ అయ్యారు.

ADVERTISEMENT
Latest Stories