క్రియేటివ్ దర్శకుడిగా కృష్ణవంశీ ‘బ్రాండ్ నేమ్’కు ఒక సపరేట్ అభిమానగణం ఉంది. వంశీ సినిమాలంటే ప్రత్యేకించి అభిమానం గుప్పించే ప్రేక్షకుల సంఖ్యకు కొదవలేదు. అలాంటి కృష్ణవంశీ రామ్ చరణ్ తో తెరకెక్కించిన ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా తర్వాత సైలెంట్ అయ్యారు. ఇటీవల కాలంలో ‘రుద్రాక్ష’ అంటూ హల్చల్ చేసినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. తాజాగా మరో ఫ్రెష్ న్యూస్ బయటకు వచ్చింది.
సందీప్ కిషన్ హీరోగా కాజల్ అగర్వాల్, లావణ్య హీరోయిన్లుగా ఒక పోలీస్ స్టోరీని కృష్ణవంశీ ఎంచుకున్నట్లుగా సినీ వర్గాల టాక్. ‘ఈగ’ ఫేం సుదీప్, ప్రకాష్ రాజ్ లు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ వర్క్ ను వంశీ ఇప్పటికే పూర్తి చేసారని, త్వరలోనే సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ‘ఖడ్గం’ సినిమా లెవల్లో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ స్క్రిప్ట్ ను కృష్ణవంశీ సిద్ధం చేసారట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.



