భారీ సినిమాలు డిజాస్టర్లయ్యాక వాటి నష్టాల తాలూకు కథలు అసలు మూవీ కంటే ఆసక్తికరంగా ఉంటాయి. ఒక వస్తువు మనకు నచ్చకపోయినా లేక నాణ్యత లోపం ఉన్నా వెనక్కు తిరిగి ఇచ్చేసి డబ్బులు డిమాండ్ చేసే వ్యవస్థ దాదాపు అని బిజినెస్ ల్లోనూ ఉంది. ఒక్క సినిమా రంగమే దానికి మినహాయింపు. ఏజెంట్ కథ ఎప్పుడో ముగిసింది.
థియేట్రికల్ హక్కులను ఏక మొత్తంలో కొనేసి గాయత్రి ఫిలింస్ ఇప్పుడు పరిహారం డిమాండ్ చేస్తోంది. మొత్తం అడగలేకపోయినా ఎంతో కొంత రికవరీని నిర్మాణ సంస్థ నుంచి ఆశిస్తోంది. కానీ నిర్మాత అనిల్ సుంకరే స్వయంగా 23 కోట్ల దాకా పోగొట్టుకున్నారు. కాబట్టి గాయత్రి వాళ్ళు ఆశిస్తున్న 15 కోట్ల మొత్తాన్ని తిరిగివ్వడం కష్టం. అందుకే సహజంగానే విముఖత వస్తుంది.
Also Read – హర్ష్ కుమార్‌కు వైసీపీ వైరస్ సోకిందా?
ఈ పంచాయితీ ఫిలిం ఛాంబర్ దాకా వెళ్లొచ్చు. ఏజెంట్ ఫలితానికి పూర్తి బాధ్యతగా అన్ని వేళ్ళు దర్శకుడు సురేందర్ రెడ్డి వైపే ఉన్నాయి. విపరీతంగా ఆలస్యం చేయడంతో పాటు బడ్జెట్ ని అమాంతం పెంచేసి రిటర్న్స్ రావడానికి ఏ మాత్రం అవకాశం లేనంత బ్యాడ్ ప్రోడక్ట్ ని ఇచ్చారు. తానూ నిర్మాణంలో భాగం కాబట్టి జవాబు చెప్పాలి
ఇక్కడ ట్విస్టు ఏంటంటే తనకు రావాల్సిన 12 కోట్ల పారితోషికంలో 6 కోట్లే ముట్టాయని కాబట్టి మిగిలిన బ్యాలన్స్ ని పరిహారంగా నిర్మాత దగ్గరే తీసుకోమని చావు కబురు చల్లగా చెప్పారట. దీంతో గాయత్రి టీమ్ ఖంగు తింది. తప్పుడు ఆపరేషన్ చేసి పేషెంట్ ని చంపిన డాక్టర్ దానికి పరిహారం హాస్పిటల్ బిల్డింగ్ ఓనర్ ని అడిగినట్టుంది ఈ వ్యవహారం.
Also Read – అందగాడికే ఇన్ని కష్టాలు…!
ఏదో పెద్ద దాన గుణం చూపించినట్టు పోయి నా బాకీలో చెల్లు చేసుకోండి అనడమంత సిల్లీ పాయింట్ మరొకటి ఉండదు. నిజానికి ఏజెంట్ తప్పులకు మూల్యం చెల్లించాల్సింది సూరినే. ఈ వ్యవహారం ఎక్కడి దాకో వెళ్తుందో కానీ ప్రొడక్షన్ లో ఒక భాగస్వామిగా ఉన్నప్పుడు నష్టాలను షేర్ చేసుకోవాల్సిందే తప్పించి నా రెమ్యురేషన్ లో సెటిల్ చేయమనడం సరికాదు.
ఆ మాటకొస్తే ఆచార్య, లైగర్, శాకుంతలం విషయంలో దర్శకులు మొత్తం కో ప్రొడ్యూసర్ల మీద వేయలేదుగా. తమ బాధ్యతను తీసుకున్నారు. మొదట బెట్టు చేసినా బయ్యర్లు రోడ్డు మీదకు రావడంతో పూరి కూడా ప్రత్యాన్మయం చూపించాల్సి వచ్చింది. సిగరెట్ వెలిగించడానికి నిప్పు అడిగితే ఆకాశంలో సూర్యుడిని చూపించినట్టుంది సూరి లాజిక్.