తప్పు లేదు ఒక సినిమా మొదలయ్యాకా…అనేక కారణాల వాళ్ళ ఆ సినిమాకు పని చేసే వాళ్ళు తప్పుకుంటూ ఉంటారు, అది ఆ సెట్ లోనో, లేక ఆ సినిమాకు సంభందించిన విషయంగానే చూడాలి. అయితే దర్శకుడు తేజా చివరి వరకూ కాస్త గౌరవంగానే ఉన్నాడు కానీ, చివర్లోనే తేలిపోయి మరో మారు విమర్శలపాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు.
ఇంతకీ తేజా చెప్పింది ఏంటి అంటే…ఎన్టీఆర్ సినిమా నుంచి తేజ బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడా ఆ సినిమా గురించి కామెంట్ చెయ్యలేదు. పోనిలే, అయిపోయింది ఏదో అయిపోయింది అని అనుకునే లోపే తేజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ తన కోపాన్ని బయటపెట్టేశాడు.
ఎన్టీఆర్ సినిమా బావుంది కానీ, పెద్దగా ప్రేక్షక్షకులను ఆకట్టుకోలేదు అన్న విషయంపై స్పందిస్తూ నేను చాలా బిజీగా ఉన్నాను…ఎన్టీఆర్ సినిమా చూడలేదు అని కొట్టిపాశాడు. అంతటితో ఆగకుండా సినిమా దర్శకుడు క్రిష్ ని టార్గెట్ గా సెటైర్ వేసేశాడు. సినిమా అంటా డ్రామా లాగా ఉంది అన్న విమర్శలు వస్తున్నాయి అన్న విమర్శలపై స్పందిస్తూ..దర్శకుడికి బుర్ర ఉంది ఉంటే సినిమా బాగా వచ్చేది అన్న విధంగా స్పందించారు.
అంటే ఈ లెక్కన తేజ కి ఎన్టీఆర్ సినిమా మిస్ అయ్యింది అన్న బాధ, కోపం, ఉక్రోషం ఉండిపోయింది అన్న మాట. ఏది ఏమైనా..సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా..తేజ కన్నా క్రిష్ బెటర్ ఆప్షన్ అనేది ట్రేడ్ చెబుతున్న మాట.



