అసురన్ రీమేక్ కు ఇద్దరు డైరెక్టర్ల పేర్లు?

Director VV Vinayak - Director Krishవిక్టరీ వెంకటేష్ తరుణ్ భాస్కర్ తో హార్స్ రేసింగ్ మీద సినిమా తీస్తారని అందరూ అనుకుంటుండగా ఆయన ఉన్నట్టుండి తెర మీదకు అసురన్ రీమేక్ ను తెచ్చారు. ధనుష్ నటించిన అసురన్ అనే సినిమా చూసి వెంకటేష్ బాగా ఎక్సైట్ అయ్యారట. సురేష్ బాబు, తమిళంలో నిర్మించిన కలైపులి తాను ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ADVERTISEMENT

అవార్డు విన్నింగ్ సినిమాల దర్శకుడు వెట్రి మారన్ తీసిన తమిళ చిత్రం అది. ఆయన రేంజిలో తీయాలంటే కష్టమే. ఆయననే ఈ సినిమాకు తీసుకోవాలని అనుకున్నా అందుకు ఆయన నో చెప్పారట. భాష ఇబ్బంది వల్ల ఈ సినిమా నేను చెయ్యలేను అని ఆయన చెప్పేశారట. దానితో ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ సినిమా కోసం వినాయక్, క్రిష్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వినాయక్ గనుక ఈ చిత్రం చేస్తే ఓపెనింగ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. క్రిష్ అయితే చిత్రాన్ని పర్ఫెక్ట్ గా రీమేక్ చేస్తారని నమ్మకం. ఈ క్రమంలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. సురేష్ బాబు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది.

వెంకటేష్ నటించిన వెంకీ మామ షూటింగ్ మొత్తం పూర్తయి రిలీజ్ కి రెడీ గా ఉంది. అయితే సినిమా రిలీజ్ తేదీ ఎప్పుడు అనేది ఇంకా నిర్ణయించలేదు. మొదట్లో సంక్రాంతికి వస్తుందని ప్రచారం జరిగినా డిసెంబర్ లోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ADVERTISEMENT
Latest Stories