అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద వ్యక్తిగత దూషణలతో రెచ్చిపోయిన వైసీపీ నేతలందరి వ్యక్తిగత భాగోతాలు ఒక్కొక్కటిగా బాహ్య ప్రపంచం ముందుకు వస్తున్నాయి. అయినా వైసీపీ నేతలలో ఇసుమంత సిగ్గు, బిడియం మచ్చుకైనా కానరావడం లేదు.
ఇక పార్టీ అధినేత అయితే ఆయా నేతల మీద కనీసం చర్యలు కూడా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు సరికదా ఇంకా అటువంటి నేతలను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారు. గత నాలుగు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంచలం రేపిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి వ్యవహారంలో మరో వివాదాస్పద సంఘటన వెలుగులోకి వచ్చింది.
మాధురి, దువ్వాడ శ్రీనివాస్ అడల్ట్రీ సంబంధం పై స్పందించిన శ్రీను భార్య దువ్వాడ వాణి, వారి పెద్ద కుమార్తె హైందవి మాధురి పై తీవ్రమైన ఆరోపణలు చేసారు. దీనితో మనస్తాపానికి గురైన మాధురి ఆత్మహత్యాయత్నానికి సిద్దమయ్యి ఆసుపత్రిలో చేరారు. అసలు విషయానికి వస్తే, సెల్ఫ్ డ్రైవింగ్ తో ప్రయాణిస్తున్న మాధురి కారు పలాస సమీపంలో టోల్ గేట్ వద్ద ప్రమాదానికి గురయ్యింది.
అయితే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించే క్రమంలో కొన్ని సంచలన నిజాలు బయటపెట్టారు మాధురి. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని తాను ముందుగా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే ప్రమాదం జరిగిందని తన ప్లాన్ వివరించారు. ముందుగా ఒక లారీని ఢీ కొట్టాలనుకున్నాను కానీ అనుకోకుండా కారును గుద్దేశాను అంటూ నిజాన్ని బయటపెట్టి వైద్యులకు, పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చింది మాధురి.
దువ్వాడ వాణి నా పై చేస్తున్న ఆరోపణలు తట్టుకోలేక ఆత్మ హత్య చేసుకోవాలనుకున్నా, నాకు వైద్యులెవ్వరు చికిత్స అందించవద్దు అంటూ మాధురి ఆసుపత్రిలో హైడ్రామా సృష్టించారు. తాను చేసిన ఈ పిచ్చి పనివలన ఎవరికైనా ఎటువంటి ప్రమాదమైన జరిగి ఉంటే ఆ కుటుంబాలకు జరిగే నష్టాన్ని, కష్టాన్ని మాధురి తీర్చగలరా?
మాధురి బాధ్యత రాహిత్యం ఎంత మంది ప్రాణాలను బలి తీసుకోదలచింది. తాను ఆత్మ హత్య చేసుకోవడానికి ఇతరుల జీవితాలను బలికోరుకుంటుందా? ఇదేనా ఒక మహిళగా కుటుంబాల గురించి వారి పిల్లల జీవితాల గురించి ఆలోచించే విధానం. పాపం తాను చేసి పరిహారం మరొకరి జీవితంలో వెయ్యాలనుకుంటుందా? కుటుంబాలను చీల్చే రాజకీయాలు అంటే ఇవేనా?
నేరాలు చెయ్యడం నిందలు వేరొకరి మీద వేయడం, శవ రాజకీయాలు చేయడం, చంపడాలు, చంపుకోవడాలు, దాడులు చేయడాలు, సెల్ఫ్ దాడులు చేయించుకోవడం అన్ని వైసీపీ హింసా రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న సామెత వైసీపీ కి కరెక్టుగా సరిపోతుంది.
తాను తన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడడానికి మరొకరి జీవితాలను బలిపీఠం ఎక్కించడానికి, తమకు సంబంధం లేని విషయంలోకి వారిని తీసుకొచ్చి వారి ప్రాణాలను బలికొనడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించని మాధురి మనస్తత్వం ఎంత హీనమైనదో, క్రూరమైనదో అర్ధమవుతుంది.
తాము చేసిన నేరాలను కప్పిపుచ్చుకోవడానికి, తమ తప్పులను మరిపించి ప్రజలలో సింపతీ సృష్టించుకోవడానికి వైసీపీ నేతలు ఎవరినైనా చావు అంచులదాకా తీసుకెళ్లగలరు అని ఈ సంఘటనతో మరోసారి రుజువు చేసారు. ఇందులో కోడికత్తి శ్రీను ఒక బాధితుడు కాగా గులకరాయి నిందితుడు సతీష్ మరో బాధితుడు.
వీరిద్దరూ వైసీపీ హింసా రాజకీయాలకు బలయ్యారు. ఇప్పుడు ఆ దారిలోనే మరొకరి జీవితాన్ని బలి చేయడానికి సిద్ధమయ్యారు దివ్వెల మాధురి. ఇటువంటి చర్యలతో మాధురి సమాజం ముందు మరోసారి దిశగా నిలబడ్డారు.




