india-australia-3rd-test-match

డిసెంబర్ 14 న బ్రిస్బేన్ లో ని ‘గబ్బా’ స్టేడియం లో భారీ అంచనాల మధ్య మొదలయిన మూడవ టెస్ట్ లో ఆటగాళ్ల కంటే గ్రౌండ్ పై వర్షపు చుక్కలే ఎక్కువ సేపు నిలిచాయి. మ్యాచ్ మొదలయ్యే ముందే వర్ష సూచన అధికంగా ఉంది. మ్యాచ్ లో ఒక్కరోజైనా పూర్తి ఆట జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి.

అయితే మొదటి రోజు ఓవర్-కాస్ట్ వాతావరణం ఉండటం వల్ల, టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకున్నారు. అనుకున్నట్టే ఆసీస్ బ్యాటర్లు మొదటి 10 ఓవర్లు వికెట్ ఇవ్వకుండానే బ్యాటింగ్ చేసారు. అయితే, మొదటి రోజున కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే పూర్తయింది. మిగతా రోజు ఆట అంతా వర్ష దేవుడు ఆడుకున్నారు.

Also Read – దెబ్బలు పడతాయ్ రాజా..

రెండవ రోజు మొత్తం బౌలింగ్ చేసినా,భారత బౌలర్లు ఆసీస్ ను ఆల్-అవుట్ చెయ్యటం లో విఫలమయ్యారు.బౌలింగ్ లో మరలా ఒంటరి పోరాటం చేసాడు బుమ్రా. మరోసారి ఆస్ట్రేలియా గడ్డ పై 5 వికెట్ హాల్ ను సంపాదించుకున్నారు. అయితే రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు పడగా, 3 వ రోజు ఆసీస్ ను ఆల్-అవుట్ చేసింది భారత్.

445 పరుగుల ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా. భారత బ్యాటర్లు ఇంతటి భారీ స్కోరును ఏ విధంగా అందుకుంటారో అనే సందేహాలకు చెక్ పెడుతూ భారత బ్యాట్స్మన్ మళ్ళీ కుప్పకూలిపోయారు. మొదటి 14 ఓవర్ల లోపలే 4 వికెట్లు కోల్పోయి తమ చెత్త బ్యాటింగ్ ఫామ్ ను కొనసాగిస్తోంది భారత్.

Also Read – మనోభావాలను….మానసిక క్షోభను ‘గాలి’కొదిలేసినట్టేనా.?

అవసరంలేని దూకుడు చూపించి వెనుదిరిగాడు జైస్వాల్, ఇన్నింగ్స్ మొదటి బంతి 4 అయినా, మరల రెండో బంతి కి మిడ్ వికెట్ వైపుగా బౌండరీ కి యత్నించగా,మార్ష్ చేతిలోకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. గిల్ వికెట్ లో ఫీల్డర్ పట్టిన క్యాచ్ హైలైట్ గా నిలిచింది. ఇక విరాట్-అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్, ఒక నెవెర్ ఎండింగ్ లవ్ స్టోరీ లా తయారయింది.




ఈ సిరీస్ లో ఒక్క ఇన్నింగ్స్ లో కూడా తన రేంజ్ ఆటతీరును చూపించటంలో విఫలమయిన రిషబ్ పంత్ మరోసారి స్కోర్కార్డ్ ను పెద్దగా కదిలించకుండానే వెనుదిరిగాడు. ఇక ఇవాళ్టి భారత బ్యాటర్ల ఆటతీరు చూస్తే ఫైనల్స్ కు వెళ్లే ఇంటెంట్ లేదన్నట్టే ఉన్నది, డూ ఆర్ డై మ్యాచ్ లో ఇటువంటి పేలవ ఆటను కనబరుస్తారని ఫాన్స్ కలలో అనుకోలేదు. చూడాలి మరి రేపు ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అని..!

Also Read – జగన్‌కి విరుగుడు వారిద్దరే… ఏమవుతుందో?