వైఎస్, ఎన్టీఆర్, చంద్రబాబుల ఇమేజ్ జగన్‌కు ఉందా?

Legend-NTR-YSR-Chandrababu-Niaidu-Jaganవినాశకాలే విపరీత బుద్ధి అంటారు పెద్దలు. అధికారంలో ఉన్నప్పుడు మిడిసిపడిన అనేక రాజకీయపార్టీలు చివరికి తుడిచిపెట్టుకుపోయాయి. ఏపీలో వైసీపి కూడా ఇదేవిదంగా వ్యవహరిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.

ఓ రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం ఎంతో కష్టం. అదీ… తిరుగులేని భారీ మెజార్టీతో అధికారం లభించడం ఇంకా కష్టం.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడుని కాదనుకొని ఒక్క ఛాన్స్ ఇమ్మనమని వేడుకొన్న జగన్మోహన్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించారు. కానీ తమను ప్రజలు ఎందుకు గెలిపించారో ఆయన కూడా గ్రహించలేదని నాలుగున్నరేళ్ళ పాలనతో అర్దమవుతోంది.

ప్రజలు తమకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని తన రాజకీయ కక్షలకు వినియోగించుకొంటుంటే, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్ష నేతలను, వారి కుటుంబ సభ్యులను ఉద్దేశ్యించి నోటికివచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. యధారాజా… అన్నట్లు వైసీపి అందరూ కలిసి తమ ప్రభుత్వం పట్ల ప్రజలలో నానాటికీ వ్యతిరేకత పెరిగేలా చేసుకొంటున్నామని గ్రహించడం లేదు.

గత ఎన్నికలలో వైసీపికి అపూర్వమైన అవకాశం లభించినట్లే, నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కి కీలకమైన సాగునీటిశాఖ మంత్రిగా అపూర్వమైన అవకాశం లభించింది. కానీ ఆయన కూడా వచ్చిన అవకాశాన్ని గుర్తించకుండా కాలక్షేపం చేసి రెండేళ్ళకే మంత్రి పదవి పోగొట్టుకొన్నారు.

అదే… మంత్రిగా తన సమర్ధత నిరూపించుకొని మంచి పేరు సంపాదించుకొని ఉంటే, ప్రజలు గుర్తుపెట్టుకొని ఆయనను గెలిపిస్తుండేవారు. మంత్రిగా మళ్ళీ మళ్ళీ అవకాశాలు లభిస్తూనే ఉండేవి కదా?

మంత్రి పదవి పోయినా నేటికీ అనిల్ కుమార్‌ ధోరణి మారలేదని తాజా వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, “ఓ పెద్ద మనిషి ( మాజీ మంత్రి నారాయణ) కూడా త్వరలో జైలుకి వెళ్ళడం ఖాయం. కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్లు టిడిపిలో కొత్తగా చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వంటివారి హడావుడి చాలా ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఏపీ సీఐడీ నిరూపించింది. అందుకే కోర్టులలో బెయిల్ లభించడం లేదు. రేపు నారా లోకేశ్‌కు అదే గతి పట్టవచ్చు,” అంటూ ఇంకా చాలానే మాట్లాడారు.

ప్రజలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్‌లను ఇప్పటికీ ఎందుకు గుర్తుచేసుకొంటున్నారు?అని వైసీపి నేతలు ఒక్కసారి ఆలోచించి ఉంటే వారికి తమ కర్తవ్యం భోదపడి ఉండేది. కానీ వచ్చిన అవకాశాన్ని అందరూ దుర్వినియోగం చేసుకొంటూ, రెండో ఛాన్స్ లేకుండా చేసుకొంటున్నారని చెప్పక తప్పదు.

ADVERTISEMENT
Latest Stories