జగన్ ఢిల్లీ పైరవీలు ఫలించినట్లేనా?

YS-Jagan-Amit-Shahఅనధికారిక పొత్తులో ముందుకెళ్తున్న వైసీపీ – బీజేపీ కలసి ఆడుతున్న రాజకీయ క్రీడలో అంచెలంచెలుగా టీడీపీ పార్టీ ఇరుక్కుపోతుందనే చెప్పాలి. రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి వైసీపీ ప్రభుత్వం కేవలం చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇవ్వడం జగన్ అధికార దాహాన్ని బయటపెడుతోంది.

ADVERTISEMENT

అధికారమే పరమావధిగా జగన్ రాజకీయ వ్యూహాలు పన్నడం వాటికి కేంద్ర మద్దతు దక్కడం ఇలా రాష్ట్రంలో అన్ని చకచకా జరిగిపోతున్నాయి. మరో ఆరునెలలో రానున్న ఎన్నికలకు చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీ పార్టీకి చెక్ పెట్టి పాలనా అనుభవం లేని నేతలతో ప్రతిపక్షాలు ఎన్నికల బరిలో దిగేలా జగన్ వేసిన స్కెచ్ కి బీజేపీ తనవంతు సహకారం జగన్ ప్రభుత్వానికి ఇస్తున్నట్టే కనిపిస్తుంది.

ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగ్ రోడ్, అంగళ్ళు కేసులో చంద్రబాబు వేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ను న్యాయస్థానాలు కొట్టివేశాయి. కోర్టులో తీర్పు రావడానికి రెండు రోజుల ముందు జగన్ ఢిల్లీ టూర్ సర్వత్రా రాష్ట్రంలో రాజకీయ చర్చకు తెరలేపింది. చంద్రబాబు ఎట్టి పరిస్థితులలో బయటకు రావడం ఇష్టం లేని జగన్ దానికి బీజేపీ పెద్దల ఆశీస్సులు పొందడానికే హస్తినకు వెళ్లారంటూ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ గట్టిగానే నడిచింది.

ఒకప్పుడు జగన్ ఢిల్లీకి వెళ్తే తన అక్రమ కేసుల మాఫీ కోసమే అని భావించే స్థాయి నుంచి పక్క పార్టీ అధినేతను జైలుకు పంపే స్థాయికి జగన్ ఎదిగారనేది విపక్షాలు కూడా గుర్తించాలి. తనపై తన పార్టీ నేతల మీద ఉన్న కేసుల విచారణ ముందుకు సాగక పోవడానికి, వారికి అవసరమైనప్పుడల్లా బెయిలు, ముందస్తు బెయిల్లు అన్ని తమకు అనుగుణంగా రప్పించుకునే స్థాయికి జగన్ ను తీసుకువచ్చిన ఘనత బీజేపీకే దక్కుతుందని చెప్పక తప్పని పరిస్థితి.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల మాట అటుఉంచితే వైసీపీ నాయాకుల, మంత్రుల ముందస్తు తీర్పులు మాత్రం రాష్ట్రంలో తూచా తప్పకుండ అమలుజరగడం చూస్తుంటే వ్యవస్థలను మేనేజ్ చెయ్యడం అంటే ఇదేనా? అనే సందేహాలు రాక మానవు. చంద్రబాబు ఇప్పట్లో బయటకు రాలేడు అంటూ కొందరు వైసీపీ మంత్రుల వ్యాఖ్యలకు బలం చేకూరేలానే న్యాయస్థానాల తీర్పులు వెలువరించడం చూస్తుంటే జగన్ ఢిల్లీ పెరవీలు ఫలించినట్లే కనిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories