
బిఆర్ఎస్ పార్టీకి కోవర్ట్, కేసీఆర్ కు కట్టప్ప, కేటీఆర్ కు గులాబీ ముళ్ళు అంటూ ఇన్నాళ్లుగా నిందలు మోస్తున్న బిఆర్ఎస్ ముఖ్య నేత మాజీ మంత్రి హరీష్ రావు ఇప్పుడిప్పుడే తన పై వస్తున్న రాజకీయ ఆరోపణలకు చెక్ పెట్టేలా వ్యవహరిస్తున్నారు.
కవిత ఎపిసోడ్ తో కేసీఆర్ కుటుంబంలో మొదలైన రాజకీయ విభేదాలు, బిఆర్ఎస్ లో మొదలైన రాజకీయ ఆధిపత్య పోరు మీడియాలో చర్చకు రాగ, అందులో కేసీఆర్ దేవుడే కానీ ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు చేరాయి అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు కేటీఆర్, హరీష్ లను ఉద్దేశించినవే అన్న ప్రచారం తెలంగాణ రాజకీయాలలో గట్టిగా జరిగాయి.
Also Read – విదేశీ భాషలు నేర్చుకోవడం గొప్ప కానీ హిందీ కాదా?
వీటిని బలపరిచే విధంగానే కవిత కూడా తన జాగృతి సంస్థతో ఒడిఒడిగా తన రాజకీయ అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ కు కవిత మెల్లిమెల్లిగా దూరమవుతూ వస్తున్నారు. అయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, హరీష్ ల పై కాళేశ్వరం విచారణకు నోటీసివ్వడంతో తన తండ్రికి మద్దతుగా గళం వినిపించిన కవిత హరీష్ విషయంలో మౌనంగా ఉండిపోయింది.
అలాగే ఇటు ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ కు ఎదురయినా ఏసీబీ విచారణ పై కూడా కవిత ఎటువంటి స్పందన కనపరచలేదు. దీనితో కవిత కు ఇప్పుడు అన్న కేటీఆర్, మామ హరీష్ ఇద్దరు కూడా రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు ఏసీబీ విచారణకు హాజరయిన కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శలతో విరుచుకుపడ్డారు.
Also Read – కవిత గెలుపు బిఆర్ఎస్ ఓటమా.?
అయితే ఈ సమయంలో కేటీఆర్ కు మద్దతుగా హరీష్ కూడా కేటీఆర్ తో కలిసి ఉన్నారు. గతంలో కేసీఆర్ బిఆర్ఎస్ పగ్గాలను కేటీఆర్ చేతిలో పెడితే హరీష్ పార్టీని రెండు ముక్కలుగా చీలుస్తారని, కేటీఆర్ ఎదుగుదలకు హరీష్ అడ్డగోడల నిలబడ్డారని ప్రత్యర్థి పార్టీల నేతలు అనేక ఆరోపణలు చేసేవారు.
అయితే ఆ ఆరోపణలన్నిటి సమాధానంగా హరీష్ పార్టీ పరంగా నాయకత్వ మార్పు నుంచి మరే ఇతర మార్పులకైనా కేసీఆర్ సిద్ధపడితే అందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని, అది కేటీఆర్ నాయకత్వమైన తానూ స్వాగతిస్తాను అంటూ ప్రకటించారు. ఇక ఇప్పుడు నాడు చెప్పిన మాటలకూ కడ్డుబడినట్లే హరీష్ కేటీఆర్ కు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వం తో పోరాటానికి సిద్దపడుతున్నట్టు కనిపిస్తున్నారు.
Also Read – 2029: ఏపీ vs వైసీపీ..?
అటు కేటీఆర్ కూడా తన తండ్రి కేసీఆర్ తో సమానమైన స్థానంలో హరీష్ కు ప్రాముఖ్యత ఇస్తూ బిఆర్ఎస్ పటిష్ఠతకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే నేడు కాళేశ్వరం వివాదం పై కేసీఆర్ తో పటు హరిష్ ను కూడా సమర్థిస్తూ రేవంత్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కేటీఆర్. దీనితో బిఆర్ఎస్ లో కవిత రేపిన చిచ్చు హరీష్, కేటీఆర్ లను దగ్గర చేసిందా అన్న చర్చ జరుగుతుంది.