
టీడీపీ మోస్ట్ వాంటడ్ లిస్టులో గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరు. ఎందుకో అందరికీ తెలుసు కనుక మళ్ళీ ఆ స్టోరీలన్నీ చెప్పుకోనవసరం లేదు.
అలాగే ఏపీ పోలీసుల జాబితాలో కూడా ఆయన పేరుంది. ఇప్పటికే ఆయన అనుచరులలో కొందరిని పోలీసులు లైన్లో పెట్టారు కూడా. ఇక నేడో రేపో కొడాలి వంతు అనుకుంటుంటే, అత్యవసరంగా ఆయన గుండె బైపాస్ సర్జరీ చేయించుకోవలసి వచ్చింది. కనుక పోలీసులు ఆయన కోసం ఓపికగా ఎదురుచూస్తున్నారు.
Also Read – బనకచర్ల పేరుతో కాంగ్రెస్, బిఆర్ఎస్ యుద్ధాలు.. ఏపీకి తలనొప్పులు!
సర్జరీ తర్వాత ఆయన ‘మరింత మెరుగైన విశ్రాంతి కోసం’ ముంబయి నుంచి అమెరికా వెళ్ళిపోతారని అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కానీ ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చి అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు.
కానీ కొడాలి నానికి ‘మరింత మెరుగైన విశ్రాంతి కోసం’ అవసరమని కనుక అమెరికా వెళ్ళక తప్పదని వార్తలు వస్తున్నాయి.
Also Read – కవిత సిగ్నల్స్.. కేసీఆర్ పట్టించుకోవట్లేదే!
జగన్ కళ్ళలో ఆనందం చూడటం కోసమే కొడాలి నాని నాడు అంతగా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, వారి కుమారుడు, మంత్రి నారా లోకేష్ గురించి అంత అనుచితంగా మాట్లాడగలిగారు.
కానీ ఆయన గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చినా ఇంత వరకు జగన్ వెళ్ళి పరామర్శించక పోవడం ఆలోచింపజేస్తుంది.
Also Read – షర్మిల ఫోన్ కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తే నాకేం సంబందం?
నాడు కొడాలి నాని ఓ అస్త్రంలా ఉపయోగపడ్డారు కనుక జగన్ వాడుకున్నారు. కానీ ఇప్పుడు ఖాళీ అయిన తూటా వంటి నేత మనకెందుకని జగన్ అనుకుంటున్నారేమో?కొడాలి నానిని జగన్ పరామర్శించకపోయినా ఏపీ పోలీసులు తప్పక పరామర్శిస్తారనే అందరూ అనుకుంటున్నారు.
ఒకవేళ కొడాలి నాని ఓ పదో-పాతికో లక్షలు చెల్లించి మెడికల్ వీసా సంపాదించుకొని అమెరికా వెళ్ళిపోతే, 2029 ఎన్నికల వరకు అక్కడే బాగా విశ్రాంతి తీసుకుని తిరిగివస్తారు.
కనుక ఆయన అమెరికా బయలుదేరేలోగా ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్ళి తోడ్కొని తీసుకువస్తారా లేదా ఆయన అమెరికా వెళ్ళిపోయే వరకు సమయం తీసుకొని ఆ తర్వాత తిరిగి రప్పించడానికి కోర్టులు, రెడ్ కార్నర్ నోటీసులు అంటూ హడావుడి చేస్తారా? అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.