నీల్ కూడా టెంప్లేట్ డైరెక్టర్ అయిపోతాడా ?

NTR in Dragon glimpse directed by Prashanth Neel with intense dark action visuals

నిన్న రాత్రి విడుదలైన “డ్రాగన్” గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వరల్డ్ ఇంట్రడక్షన్ కానీ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజన్స్ & ట్రాన్సఫర్మేషన్ అద్భుతంగా ఉంది. ఇక రవి బస్రూర్ నేపథ్య సంగీతం హాలీవుడ్ స్థాయిలో ఉంది. అలాగే.. బైబిల్ వచనాలను హైప్ & ఎలివేషన్ గా వినియోగించుకున్న తీరు కూడా అదిరిపోయింది.

అయితే.. ప్రశాంత్ నీల్ మునుపటి సినిమాలైన “ఉగ్రం, కేజీఎఫ్, సలార్” వంటి సినిమాలతో పోల్చినప్పుడు “డ్రాగన్” సినిమాలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. మరీ ముఖ్యంగా.. కలర్ గ్రేడింగ్ మొదలుకొని, వరల్డ్ & ఇంటెన్సిటీ వంటివన్నీ ప్రశాంత్ నీల్ మునుపటి సినిమాలను తలపించాయి.

ADVERTISEMENT

ఒక దర్శకుడికి తనకంటూ ప్రత్యేకమైన స్టైల్ కచ్ఛితంగా ఉంటుంది. ఆ స్టైల్ ను ప్రతి సినిమాకి ఫాలో అవ్వడంలో తప్పు లేదు. కానీ.. అది మరీ ఆల్రెడీ చూసేశాం కదా అనే భావన కలిగించకూడదు. వినాయక్, సురేందర్ రెడ్డి వంటి మాస్ మసాలా డైరెక్టర్స్ కూడా సినిమా సినిమాకి వైవిధ్యం చూపించారు.

కానీ నీల్ మాత్రం అదే గ్యాంగ్స్ & డార్క్ థీమ్ తోనే తన ప్రతి సినిమా తీస్తున్నాడు. “డ్రాగన్” కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి. దాంతోపాటుగా ప్రశాంత్ నీల్ ఒక టెంప్లేట్ డైరెక్టర్ గా మిగిలిపోకుండా, తన డార్క్ థీమ్ లోనే కాస్తంత వైవిధ్యం చూపించాలి. లేదంటే.. బోర్ కొట్టేస్తాడు.

ADVERTISEMENT
Latest Stories