రెండవ సాంగ్ రచ్చ చేసేలా ఉంది!

DSP rocks Rangasthalam second singleగతంలో గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాల్లో చాలావరకూ భారీ విజయాలను అందుకున్నాయి. చాలాకాలం తరువాత మళ్లీ గ్రామీణ నేపథ్యంలో కథను ఇతివృత్తంగా తీసుకుని సుకుమార్ ‘రంగస్థలం’ సినిమా చేస్తున్నాడు. చరణ్ .. సమంత నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే వదిలిన మొదటి పాటకు అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ‘రంగా .. రంగా .. రంగస్థలాన ..’ అనే రెండవ సాంగ్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా వదిలారు. అలాగే ఈ సందర్భంగా రిలీజ్ చేసిన దేవిశ్రీప్రసాద్ డప్పు అభిమానులను ఊర్రూతలూగిస్తోంది.

ADVERTISEMENT

లవ్ .. మర్డర్ మిస్టరీ .. రాజకీయాల నేపథ్యంలో ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. మార్చి 18వ తేదీన వైజాగ్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా .. ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక వార్త బయటకు రావాల్సి ఉంది.

ADVERTISEMENT
Latest Stories