తెలుగు సినిమా స్థాయి పెరగడంతో ఇతర ఇండస్ట్రీ హీరోలు, నటీనటులు తెలుగులో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్ ఎంట్రీకి హీరోహీన్స్ మాత్రమే మక్కువ చూపితే ఇప్పుడు ఆ కోవలోకి హీరోలు కూడా వచ్చి చేరుతున్నారు.
Also Read – వరద కష్టాలతో ప్రభుత్వానికి కొత్త పాఠాలు… నేర్చుకోవలసిందే!
మహానటి సినిమాతో జెమిని గణేశం గా టాలీవుడ్ కు పరిచయమైన దుల్కర్ సీతారామం, లేటెస్ట్ సన్సేషనల్ కల్కిలో భాగమయ్యారు. సీతారామం సినిమాతో టాలీవుడ్ లో మెయిన్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన మమ్ముటి వారసుడు దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు.
ఆ సినిమా ఇచ్చిన విజయంతో మరోసారి తెలుగు సినిమాలో నటించడానికి ముందుకొచ్చారు దుల్కర్.సేనాపతి దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అంటూ మరోసారి పాన్ ఇండియా హిట్ కోసం ఎదురు చూస్తున్నారు దుల్కర్.
Also Read – తెలీని విషయాలు మాట్లాడి నవ్వులపాలవడం దేనికి?
హనురాఘవ దర్శకత్వంలో వచ్చిన సీతారామం ‘యుద్ధం రాసిన ప్రేమ కథ’ గా వచ్చి ఒక క్లాసిక్ మూవీగా నిలిచింది. అటు వెండి తెర మీదే కాదు ఇటు బుల్లి తెర మీద కూడా తన హావ కొనసాగించింది దుల్కర్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా నిలిచింది సీతారామం.
ఒక ప్రేమ కథ తరువాత కింగ్ ఆఫ్ కోత అంటూ మాస్ మూవీతో వచ్చినా అది థియేటర్ల వద్ద ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆకాశంలో ఒక తార అంటూ ఒక పల్లెటూరి నేపథ్యం ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. మరి దుల్కర్ ఆశలను పవన్ సాధినేని ఏమేరకు నిలబెడతారో థియేటర్లలో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.
Also Read – తెలుగు రాష్ట్రాలను వెంటాడుతున్న వర్షాలు..!
గీత ఆర్ట్స్, లైట్ బాక్స్, స్వప్న సినిమా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మిగతా తరగణాన్ని, ఇతర వివరాలను త్వరలో విడుదల చేస్తాం అంటూ మేకర్స్ వెల్లడించారు.