ఆ మద్యన ‘సంస్కారవంతమైన సోప్.. మరక మంచిదే..’ అంటూ ఓ బట్టలు ఉతుక్కునే సబ్బు వాణిజ్య ప్రకటనని చూసి ‘బట్టల సబ్బుకి సంస్కారం’ అంటూ అందరూ పకపకా నవ్వుకున్నారు.
అలాగే ఓ టెలికాం కంపెనీ ‘ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది..’ అనే వాణిజ్య ప్రకటన కూడా అందరిని బాగా ఆకట్టుకుంది.
మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత సోషల్ మీడియాలో ఈ ప్రకటన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురిలకు అప్లై చేస్తూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ చాలా ఆకట్టుకుంటుంది.
ఇటీవల మాధురి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పెట్టారు. డిఎస్ అని పైన వ్రాసున్న ఆ ఫోటోలో ఆమె ఓ చేతిలో ఏకె-47 తుపాకీ పట్టుకొని, పక్కనే కూర్చున్న దువ్వాడ శ్రీనివాస్ భుజంపై మరో చేయ్యాన్చి స్టైల్‌గా నిలబడి ఫోజ్ ఇచ్చారు.
వారి ఫోటోని ఓ వ్యక్తి ట్యాగ్ చేస్తూ “ఇన్‌స్టాలో పెట్టింది అక్క.. తెలిసి పెట్టిందో తెలీక పెట్టిందో…’ అంటూ కామెంట్ చేశారు.
దానిని మరో వ్యక్తి ట్యాగ్ చేస్తూ “ఈ (మాధురి) ఎపిసోడ్ లేకపోతే ఈయనో ఎమ్మెల్సీ అనే విషయం తొమ్మిది కోట్ల మందికి తెలిసేదే కాదు. ఆయనకు మరక మంచే చేసింది..” అంటూ వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. నిజమే కదా?
వైసీపీ ఎమ్మెల్సీగా దువ్వాడకు రాని గుర్తింపు, మాధురితో వచ్చింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు… అమెరికాలో కూడా వారి జంట చాలా పాపులర్ అయ్యింది.
కనుక చేతిలో సంస్కారవంతమైన సబ్బు ఉంటే మరక మంచిదే.. ‘ఓ ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది..’ అని నిరూపితమైంది కదా!





