ys-jagan-divvela-madhuri-duvvada-srinivas

వైసీపిలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తర్వాత ఆ అ లైన్లో అంతగా పాపులర్ అయినవారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ అంటే అతిశయోక్తి కాబోదు. వైసీపిలో గంటా అరగంట నేతలతో ఆయన పోటీ పడేవారా? అంటే ఖచ్చితంగా చెప్పలేము వారు పోటీ పడితే తప్ప!

Also Read – కేసీఆర్‌ స్వానుభవంతో చెప్పిన మంచి మాటలు విన్నారా?

కానీ తన హీరో దువ్వాడ శ్రీనివాస్‌కి ఎవరూ సాటి రారని దివ్వెల మాధూరీ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. అయితే ఈ మాట వినగానే ఆమెను అపార్ధం చేసుకోకూడదు. ఆమె రాజకీయాలలో సాటిరారని చెప్పారు.

వారిరువురు తిరుపతిలో వ్యాహ్యాళికి వస్తే పోలీసులు వారిపై కేసు పెట్టడం, దానిపై టిడిపి, జనసేన మద్దతుదారులు విమర్శలు గుప్పించడంతో దివ్వెల మాధూరీ మళ్ళీ నోటికి పని చెప్పక తప్పలేదు. అయితే ఆమె మాట్లాడిన మాటలు ‘నా హీరో ఎన్నికల బరిలో నిలిస్తే ఎవరూ ఎదుర్కొలేరని’ చెప్పబోతే ‘ఆయనకు వైసీపి మద్దతు కూడా అవసరంలేదన్నట్లు’ చెప్పిన్నట్లయింది.

Also Read – టిడిపి సభ్యత్వ నమోదు చేసుకుంటే వైసీపి….

ఇంతకీ ఆమె ఏమన్నారంటే, “టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్‌గారికి ఎదురే లేదు. ఆయనకు ఎవరి మద్దతు అవసరం లేదు. స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసినా గెలవగల దమ్ముంది ఆయనకు,” అని అన్నారు. ఆమె ఉద్దేశ్యం తమ సొంత వ్యవహారంలోకి వైసీపిని, తమ అధినేతని లాగొద్దని చెప్పడం మాత్రమే. కానీ తమకు వైసీపి మద్దతు కూడా అవసరం లేదని చెప్పిన్నట్లు వినిపిస్తోంది.

వైసీపి నేతలు రసిక శిఖామణులని టిడిపి నేతలు దెప్పిపొడుస్తూనే ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురీ చేసిన రచ్చతో టిడిపి వాదనలు నిజమే అని మరోసారి నిరూపించారు.

Also Read – కాంగ్రెస్‌ కొత్త టెక్నిక్ ఇదే… భలే చెప్పావయ్యా బండి!

అయితే వారివురురూ ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నా జగన్మోహన్‌ రెడ్డి వారిని వారించకపోవడం ఆలోచింపజేస్తోంది. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో పీకల్లోతు మునిగిపోయి బయటకు రాలేక జగన్‌ ఇబ్బంది పడుతున్న సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధూరీ తిరుమలలో రీల్స్ చేయడం, ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం యాదృచ్ఛికంగా జరిగిన్నట్లు అనిపించవు. బహుశః జగన్‌ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే వారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారేమో? అనే అనుమానం కలుగుతోంది.