గత వైసీపీ ప్రభుత్వ హయంలో నిత్యం బటన్ నొక్కడం.. అక్కలు చెల్లెళ్ళ ఖాతాలలో నేరుగా డబ్బులు జమా చేయడం… మద్యలో మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల బూతులు వంటివి వినిపిస్తుండేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బూతులు వినిపించడం లేదు. మూడు పార్టీల మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు అందరూ చాలా హుందాగా మాట్లాడుతున్నారు. కానీ నేటికీ వైసీపీ నేతలు,కార్యకర్తలు రప్పా రప్పా అంటూనే ఉన్నారు.
ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పడు ప్రతీరోజూ అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సాల గురించి వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఈ మార్పుని ఇరుగు పొరుగు రాష్ట్రాలు కూడా గమనిస్తూనే ఉన్నాయి. ఇది వరకు “తెలంగాణని చూసి నేర్చుకొండర్రా…” అనే వాళ్ళే ఇప్పుడు “ఏపీని చూసి నేర్చుకొండర్రా…” అంటున్నారంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎంత జోరుగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఇటీవల సిఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశంలో వారానికో పరిశ్రమకు శంకుస్థాపన జరుగుతుందనప్పుడు ఏదో గొప్పకు చెప్పుకున్నారని చాలా మంది భావించారు. కానీ ఆయన ఆ మాటన్న వారం తిరక్కుండానే నేడు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు పనులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్లు పెట్టుబడితో ఏర్పాటుచేస్తున్న ఈ ఏఎంసీఏలో యుద్ధ విమానాలు తయారు చేస్తారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి నారా లోకేష్, పలువురు ఎంపీలు, ఢిల్లీ నుంచి వచ్చిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






