పెద్ది రిలీజ్ కి తొలగిపోయిన అడ్డంకులు

Peddi movie poster amid Tollywood producers and exhibitors release controversy in Telangana

ఎగ్జిబిటర్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ గొడవ ఎఫెక్ట్ “పెద్ది” మీద పడిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా శిరీష్ రెడ్డి చాలా గట్టిగా “ప్రొడ్యూసర్లు టికెట్ హైక్ జీవోలు తెచ్చుకున్నా.. సింగిల్ స్క్రీన్ లలో మాత్రం మేము రెగ్యులర్ రేట్స్ కే టికెట్స్ అమ్ముతాం” అని ఇచ్చిన స్టేట్మెంట్ పెను దుమారం రేపింది. ఇక నిన్న ఎగ్జిబిటర్ల మీట్లో అయితే అసలు తెలంగాణలోని ఏ ఒక్క సింగిల్ స్క్రీన్ లోనూ “పెద్ది” రిలీజ్ అవ్వదు అని ఎగ్జిబిటర్లు అల్టిమేటం జారీ చేయడం అనేది ఇండస్ట్రీకి కూడా చిన్నపాటి షాక్ ఇచ్చింది.

అయితే.. ఇవాళ ఫిలిం ఛాంబర్లో జరిగిన మీటింగ్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, లెస్సీలు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. నిర్మాతలు కూడా షేరింగ్ పద్ధతికి సుముఖత చూపుతూ ఒక కమిటీ ఫార్మ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆ కమిటీ ఇచ్చే తీర్మానానికి అందరూ సమ్మతించాలని నిర్ణయించుకున్నారు.

ADVERTISEMENT

దీంతో.. పెద్ది సినిమా చుట్టూ అల్లుకున్న అడ్డంకులన్నీ తొలిగిపోయినట్లే. ఆల్రెడీ ఆంధ్రాలో ప్రీమియర్స్ కి 500, మొదటి 10 రోజులు 100 రూపాయల టికెట్ హైక్ కి అర్జీ పెట్టుకున్నారు. అక్కడ హైక్ కన్ఫర్మ్ అయిపోతుంది. మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉండగా.. ముందుగా సింగిల్ స్క్రీన్ లలో పెద్ది ప్రదర్శనకి ఇబ్బంది లేకపోవడం అనేది ఊరటనిచ్చింది.

ఇప్పుడు సమస్యలన్నీ తొలగిపోయాయి కాబట్టి, ఇప్పటికైనా పెద్ది టీం ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో కాస్త ఆసక్తి రేగేలా చేయగలిగితే మంచి ఓపెనింగ్స్ & కలెక్షన్స్ వస్తాయి. ఇక అంతా బుచ్చిబాబు & టీమ్ చేతిలోనే ఉంది.

ADVERTISEMENT
Latest Stories