దువ్వాడలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా?

Duvvada-Srinivas-Affair Controversy

వైసీపిలో లెక్కలేనన్ని ఆణిముత్యాలు. వాటిలో దువ్వాడ శ్రీనివాస్ కూడా ఒకరని అందరూ కాస్త ఆలస్యంగా తెలుసుకోగలిగారు.

అయితే అందరూ చూసింది ‘ఆ భాగోతం’ ఒక్కటే కానీ ఇంకా ఎవరికీ తెలియని చాలా స్టోరీలే ఉన్నాయట! తాజాగా వాటిలో మరొకటి బయట పడింది.

ADVERTISEMENT

టెక్కలి పట్టణంలో తెల్గాం జంక్షన్ వద్ద తన ప్రియ మాధురి పేరిట ఓ పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి కానుకగా ఇవ్వాలనుకున్నారు. దానికి సదరు పెట్రోలియం కంపెనీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. అయితే దాని గురించి తమ క్రింద స్థాయి అధికారితో మాట్లాడమని వారు సూచించడంతో దువ్వాడ శ్రీనివాస్‌ ఆయనకు ఫోన్ చేశారు.

“నేను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ని మాట్లాడుతున్నాను. నేను మీపై అధికారులతో మాట్లాడాను. నాకు తక్షణం అక్కడ పెట్రోల్ బంక్ ఏర్పాటుకి అవసరమైన అనుమతి మంజూరు చేయాలని దువ్వాడ కోరారు.

కానీ ఆ అధికారి “మీ దరఖాస్తు తిరస్కరించబడిందని చెప్పడంతో దువ్వాడలో ‘వైసీపి నాయకుడు’ మేల్కొన్నాడు.

అంతే… “నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? నేను పోర్టుకి రోజుకి 20వేల లీటర్ల డీజిల్ సరఫరా చేయాలి. నాకు వెంటనే పెట్రోల్ బంక్ ఇవ్వాల్సిందే….” అంటూ పట్టుబట్టారు.

కానీ సదరు అధికారి కూడా ఏమాత్రం జంకాకుండా “మీరు ఎమ్మెల్సీ కావచ్చు కానీ నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడకూడదు. ఎందుకంటే సదరు సంస్థ ప్రతినిధి మాత్రమే దీని గురించి ఫోన్ చేసి అడగవచ్చు వివరాలు తెలుసుకోవచ్చు. కానీ మీరు ఇలా ఫోన్ చేయకూడదు… అడగకూడదు… ఈ విషయం గురించి మాట్లాడేందుకు మీరు ఆధరైజ్డ్ పర్సన్ కాదు” అని పద్దతిగానే చెప్పారు.

ఓ ఎమ్మెల్సీతో ఓ నెలజీతగాడు ఈవిదంగా మాట్లాడితే మండదా?ఆ అధికారి మాటలు పుండు మీద కారం చల్లిన్నట్లవదా?

అందుకే దువ్వాడ శ్రీనివాస్‌ విశ్వరూపం చూపించేశారు. “నన్ను ఆధరైజ్డ్ పర్సన్ కాదంటావా? నేను ఆధరైజ్డ్ పర్సన్ కాదంటే నీతో నేనెందుకు మాట్లాడుతాను?” అంటూ నిలదీశారు.

“అవును… మీరు ఆధరైజ్డ్ పర్సన్ కాదనే నేనూ చెపుతున్నా… మరెందుకు మీరు నాతో ఇంకా మాట్లాడుతున్నారు?” అంటూ అధికారి తిరిగి అడిగేసరికి దువ్వాడ శ్రీనివాస్‌ మరింత ఆగ్రహంతో చెలరేగిపోయారు.

చిన్న పిల్లలు చాక్లెట్ కావాలని మారాం చేసిన్నట్లుగా దువ్వాడ శ్రీనివాస్‌ నాకు పట్టణం నడిబొడ్డున పెట్రోల్ బంక్ కావాలని మారాం చేస్తున్నట్లుంది. కానీ ఎందుకు ఇవ్వవని నిలదీసి అడుగుతున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఉంది. ప్రజా ప్రతినిధులు ఈవిదంగా ఒత్తిడి చేసినప్పుడు అధికారులు నిబందనలకు లోబడి ఏవిదంగా నిర్భయంగా వ్యవహరించవచ్చో సదరు అధికారి నిరూపించి చూపారు. కానీ మాజీ మంత్రి జోగి రమేష్ భూవ్యవహారంలో అధికారులు ఈవిదంగా వ్యవహరించ లేకపోయారు. కనుకనే నేడు పోలీస్ కేసులు చిక్కుకున్నారని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories