డీవీవీ ఎంటర్‌టేన్‌మెంట్ బ్యానర్ లో టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న కధనం ప్రకారం 300 కోట్ల భారీ బడ్జెట్ తో అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెకిస్తున్న సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’. అయితే ఈ బడా హీరోలతో సినిమాలు తీసే నిర్మాత దానయ్య సడన్ గా ఇంత భారీ బడ్జెట్ సినిమా ఎలా తెరకెక్కిస్తున్నాడా అనుకున్నారు అందరూ.
[m9ad]
ఇక బడా నిర్మాత అయిన దాన్నయ్య తాజాగా రామ్ చరణ్ తో చేస్తున్న వినయ విధేయ రామ సినిమాకి ఇప్పటికే డబల్ ప్రాఫిట్ వచ్చిందని. దాదాపుగా 60 కోట్ల బడ్జెట్ తో తీసిన సినిమా కావడంతో ఈ సినిమా ఎంత పెద్ద భారీ హిట్ అయినా నిర్మాతకు బ్రేక్ ఈవెన్ కావాలి అంటే చాలా కష్టమే. అయితే అలాంటి క్రమంలో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో రామ్‌చరణ్ వినయ విధేయ రామ సినిమాకి అన్నీ కలసి 120కోట్ల వరకు ప్రీ రిలీజ్ సేల్స్ ద్వారా వచ్చేశాయి. ఇక ఈ లాభాలు మొత్తం తీసుకువెళ్ళి దానయ్య రాజమౌళి సినిమాలో పెడుతున్నాడు అంటూ తెలుస్తుంది.
అంతేకాదు…రేపు వినయ విధేయ రామ విడుదల తర్వాత వచ్చే ప్రతీ రూపాయి లాభం లెక్కే కావడంతో, ఆ లాభాలు అన్నీ ‘ఆర్.ఆర్.ఆర్’ నిర్మాణానికి మళ్లించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్తలు టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తున్న వార్త. మొత్తంగా చూసుకుంటే బడా నిర్మాతలు బడా హీరోల పుణ్యమా అని, బాగానే వెనకేస్తున్నారు లాభాలను. మరి రిలీజ్ కి ముందే అంత వసూళ్లు సాదించింది చెర్రీ ‘వీ..వీ..ఆర్’ ఆతర్వాత ఇంకెన్ని కలెక్షన్స్ ను కొల్ల గొడుతుందో చూద్దాం.



