అధికారిక ప్రకటన – మొత్తంగా 38 కోట్లు రాబట్టాడు!

ekkadiki-pothavu-chinnavada-collections-30-crores-worldwideచిన్న సినిమాలు ఎంతటి ఘనవిజయాన్ని సాధిస్తాయో అన్న దానికి నిలువెత్తు నిదర్శనంగా “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా నిలిచింది. నోట్ల రద్దుతో వరుసగా సినిమాలన్నీ వాయిదా పడుతున్న తరుణంలో… చిత్ర యూనిట్ ఈ సినిమాను ఎందుకు అంత ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిందో నిరూపణ అయ్యింది. మంచి సినిమాలకు ఎప్పుడూ పట్టం కడతామని ప్రేక్షకులు, సినీ అభిమానులు ఈ సినిమా ద్వారా మరోసారి ప్రూవ్ చేసారు.

నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 30 రోజుల్లో 38 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లుగా చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేసింది. 50 రోజులుఆకూ శరవేగంగా పరుగులు పెడుతున్న ఈ చిత్ర గ్రాస్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను అబ్బుర పరుస్తున్నాయి. ఈ సినిమాకు అయిన బడ్జెట్ ఎంత? వచ్చింది ఎంత? అంటూ లెక్కలు పెడుతూ… ఈ ఏడాది అసలు సిసలు ‘బ్లాక్ బస్టర్’ సినిమాలలో టాప్ 3లో ఒకటిగా నిలిచిందన్న లెక్కలను ట్రేడ్ పండితులు వెల్లడిస్తున్నారు.

ADVERTISEMENT

వినూత్నమైన కధలను ఎంపిక చేసుకుంటూ సినిమా సినిమాకు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్న నిఖిల్, ఈ సినిమా ద్వారా మరో మెట్టు ఎదిగారని చెప్పవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాక, ఓవర్సీస్ లో కూడా “ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమా భారీ విజయాన్ని అందిపుచ్చుకోవడం విశేషం. దేశాన్ని కుదిపేసిన నోట్ల రద్దును, సినీ ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీని దాటుకుని ఇంతటి ఘనవిజయం సాధించిన చిత్ర యూనిట్ కు మనం కూడా శుభాకాంక్షలు చెప్దాం.

ADVERTISEMENT
Latest Stories