రాజమండ్రిలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది హీరోలు మా కూటమి ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారు. కానీ అంత మాత్రాన్న ఎవరిపై మా ప్రభుత్వానికి ద్వేషం లేదు. అందరి సినిమాలు బాగా ఆడాలని, నిర్మాతలకు నాలుగు రూపాయలు మిగలాలనే కోరుకుంటాము,” అని అన్నారు.
శాసనసభ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్‌కి, జనసేన పార్టీకి మద్దతు పలుకుతారనుకుంటే తన స్నేహితుడైన వైసీపీ అభ్యర్ధికి మాత్రమే మద్దతు పలికారు. కానీ వైసీపీ దానిని తమ పార్టీ అంతటికే మద్దతు అన్నట్లు అన్వయించుకొని ప్రచారం చేసుకోవడం వలన అల్లు అర్జున్ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకున్నారు.
కూటమి ప్రభుత్వం కూడా ఆయన పరిస్థితి అర్దం చేసుకుంది కనుకనే పుష్ప-2కి తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా ప్రోత్సహించింది.
వైసీపీ వైపు ఉన్నట్లు కనిపించిన అల్లు అర్జున్ సినిమానే ప్రోత్సహించినప్పుడు అబ్బాయ్ రామ్ చరణ్ సినిమాని, బావ బాలయ్య సినిమాకు కూటమి ప్రభుత్వం ప్రోత్సహించకుండా ఉండదు. కనుక రెండు సినిమాలకు చకచకా అవసరైన అనుమతులు ఇచేస్తు జీవోలు జారీ చేసింది.
త్వరలో విడుదల కాబోయే ఇతర హీరోల సినిమాలకు కూడా ఇదే పద్దతిలో సహకరిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పకనే చెప్పేసింది. కనుక తెలుగు సినీ పరిశ్రమకి ఏపీ ప్రభుత్వం రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం చెప్పేసిన్నట్లే.
పురుషులందు పుణ్య పురుషులు వేరన్నట్లు సినీ పరిశ్రమలో కూడా రోజా, రాంగోపాల్ వర్మ, పోసాని కృష్ణ మురళి, తాజాగా ఆ జాబితాలో చేరిన యాంకర్ శ్యామల వంటివారు వేరు. కనుక వారికి మాత్రం ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వడం చాలా అవసరమని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. వారందరికీ కూటమి ప్రభుత్వం వల వేసింది కానీ ఎవరూ దాని వలలో చిక్కడం లేదు పాపం!




