ప్రతి సంవత్సరం సినీ కళాకారులకు అవార్డులు ప్రకటించే సైమా, ఇటీవల అవార్డుల కోసం నామినీలను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘టెంపర్’ సినిమాలో అభినయానికి గానూ జూనియర్ ఎన్టీఆర్ పేరు లేకపోవడంతో హాట్ హాట్ డిస్కషన్స్ నడిచిన ఈ విభాగంలో ‘బాహుబలి’ సినిమాకు గానూ ప్రభాస్ కు మరియు ‘శ్రీమంతుడు’ సినిమాకు గానూ మహేష్ బాబుల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఇద్దరి హీరోలకు నెటిజన్లు ఓట్లు వేస్తూ మద్దతు తెలుపుతున్న తరుణంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ రేస్ లోకి వచ్చారు.
అసలు విషయమేమిటంటే… అప్పటివరకు కనీసం పోటీ స్థాయిలో లేని బన్నీ, ఏకంగా మహేష్, ప్రభాస్ లను మించి ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసాడు. అది కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాకు గానూ! అయితే దీని వెనుక అసలు వాస్తవం తెలుసుకున్న సైమా అవాక్కయ్యింది. దాదాపు 30 వేల ఫేక్ ఓట్లు బన్నీ ఖాతాలో పడినట్లుగా గుర్తించి, వెంటనే వాటిని తొలగించేసారట. దీంతో మళ్ళీ రేస్ మునుపటి స్టేజ్ లోకి వచ్చింది. సైమా అధికారిక వెబ్ సైట్ ద్వారా ఓటింగ్ లో పాల్గొనే ఈ అవార్డుల వేడుకను జూన్ 30, జూలై 1వ తేదీలలో సింగపూర్ లో నిర్వహించనున్నారు.



