ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం. అసలు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారో లేదో తెలియకుండా నేనే సీఎం అని చెప్పుకుంటూ జగన్ ఆభాసుపాలయ్యారు. ఇప్పుడు కొత్తగా తన కాబినెట్ పదవులు కూడా పంచేస్తున్నారు. నిన్న కుప్పంలో జరిగిన పాదయాత్రలో ఆయన చంద్రబాబు పార్టీ అభ్యర్థి చంద్రమౌళీని గెలిపిస్తే కాబినెట్ మంత్రిని చేస్తా అని పిలుపునిచ్చారు.
అదే విధంగా కొంతమంది పార్టీ నాయకులకు అప్పుడే మంత్రి పదవులు పంచేస్తున్నారట. ఒకప్పటి మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు పార్టీలోకి వస్తామంటే జగన్ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారంట. మన కాబినెట్ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందని చెప్పి వారికి ఇష్టం ఉంటే చేర్చుకోండి అంటున్నారంట. ఈ సమాధానానికి నిర్ఘాంతపోవడం వారి వంతు అయ్యిందట.
పాదయాత్రకు వస్తున్న జనాలను చూసి జగన్ వచ్చే సారి పదవిలోకి రావడం పక్కా అనుకుంటున్నారట. అయితే జగన్ కు జనాలు రానిది ఎప్పుడు? ఆయన పార్టీ పెట్టిన నాటినుండి జనం బానే వస్తారు అయితే ఓట్లు మాత్రం పడలేదు 2014లో. వాస్తవానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గెలుస్తామనే నమ్మకం వైకాపా నాయకులకు సైతం లేదు.
ఆ విషయం వారు బాహాటంగా ఒప్పుకోకపోయినా అదే నిజమని వారికి తెలుసు. దీని వల్లే ముందస్తు ఎన్నికలు వస్తాయేమో అని చాలా మంది భయపడుతున్నారు కూడా. ఈ సమయంలో జగన్ అత్యుత్సాహంతో వారి దిమ్మ తిరుగుతుంది అంట. ప్రజలు నవ్వుతారేమో అనుకోకుండా ఏంటి ఈ రచ్చ అనుకుంటున్నారట.



