ఈ నెల 15వ తేదీ వరకు అందరూ ఆగండి… పవన్ కళ్యాణ్ పెదవి విప్పుతారు… అంటూ కత్తి మహేష్ – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంగా కోన వెంకట్ కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో తాను 15వ తేదీ వరకు ఏమీ స్పందించనని చెప్పిన కత్తి మహేష్, ఓ రెండు రోజుల పాటు అలాగే నిశ్శబ్దం వహించారు. అయితే పవన్ ఫ్యాన్స్ తనను సైలెంట్ గా ఉంచేలా లేరని, తాను ఊరు వెళ్తున్నా వెంబడిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో 15వ తేదీ కోసం కత్తి మహేష్ తో పాటు పవన్ అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూసారు.
15వ తేదీ వచ్చింది… వెళ్ళింది..! కానీ పవన్ మౌనం మాత్రం వీడలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కోన వెంకట్ చెప్పేనాటికి ‘అజ్ఞాతవాసి’ సినిమా ఇంకా విడుదల కాలేదు. బహుశా ఈ సినిమా ఫలితంతో పవన్ తీవ్ర నిరాశలో మునిగిపోయి, మీడియాకు ఫేస్ చూపించలేకపోతున్నారా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే… పవన్ కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమా రికార్డులకెక్కడం అనేది పవన్ ను మానసికంగా కృంగదీసిందా? అన్న కోణంలో కూడా చర్చలు జరుగుతున్నాయి.
మరి ఇలా అయితే పవన్ ఎప్పటికి “అజ్ఞాతం” నుండి బయటకు వస్తారు? తదుపరి సినిమా గురించి, అలాగే తదుపరి రాజకీయ కార్యాచరణ గురించి ఎప్పుడు ప్రకటిస్తారు? అలాగే కత్తి మహేష్ కధకు శుభంకార్డు ఎప్పుడు వేస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది. మీడియా వర్గాల కధనం ప్రకారం…. నేడో, రేపో పవన్ నుండి ప్రకటన రావొచ్చని కధనాలు ప్రసారం చేస్తున్నప్పటికీ… అధికారికంగా మాత్రం ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అలాగే 15 వరకు వేచిచూడమని చెప్పిన కోన వెంకట్ నుండి కూడా ఎలాంటి సమాచారము వ్యక్తం కాలేదు.





